ETV Bharat / state

ప్రజలపై చెత్త పన్ను వేసేయ్‌ - చెల్లించకపోతే సంక్షేమ పథకాలు తీసెయ్ - జగన్ తీరుపై వైఎస్సార్​సీపీ నేతల విమర్శలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 10:22 AM IST

Garbage_Tax_In_AP
Garbage_Tax_In_AP

Garbage Tax In AP: దేశంలో తమ మాదిరి ఏ ప్రభుత్వమూ సంక్షేమాన్ని అమలు చేయలేదంటూ పదే పదే ఊదరగొట్టే సీఎం జగన్‌ వాస్తవానికి ఓ చేత్తో ఇస్తూనే మరో చేత్తో లాగేస్తున్నారు. ప్రజల నుంచి డబ్బు రాబట్టేందుకు రకరకాల మార్గాల్ని ఎంచుకున్న ఆయన ప్రభుత్వం చివరికి "చెత్త"నూ వదల్లేదు. చెత్తపై పన్ను ఏంటని సొంత పార్టీ నాయకులే మొత్తుకుంటున్నా ఖాతరు చేయడం లేదు. నెల నెలా ముక్కుపిండి మరీ యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. చెల్లించని వాళ్ల దుకాణాలు, ఇళ్లముందు చెత్తను కుమ్మరిస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థల ప్రాథమిక బాధ్యతల్లో ఒకటైన చెత్త సేకరణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజలపై చెత్త పన్ను వేసేయ్‌-చెల్లించకపోతే సంక్షేమ పథకాలు తీసెయ్-జగన్ తీరుపై వైసీపీ నేతల విమర్శల వర్షం

Garbage Tax In AP : చెత్త పన్ను తప్పనిసరిగా చెల్లించాలని జగన్‌ ప్రభుత్వం ప్రజలకు హుకుం జారీ చేస్తోంది. గత నెల 14న కర్నూలు గాంధీనగర్‌లోని దుకాణాలకు చెత్త సేకరిస్తున్నందుకు వినియోగ రుసుములు చెల్లించాలని నగరపాలక సంస్థ సిబ్బంది తాళాలు వేశారు. సి.క్యాంపులో వినియోగ రుసుములు చెల్లించలేదని ఓ దుస్తుల దుకాణం ముందు చెత్త ట్రాక్టర్‌ అడ్డంగా పెట్టారు. ఆరు నెలల వినియోగ రుసుముల బకాయిలు ఒకేసారి చెల్లించాలని కృష్ణా జిల్లా తాడిగడప పురపాలక సంఘంలో వాలంటీర్లు కొద్ది రోజులుగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. చెత్త పన్ను చెల్లించకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని కొందరు బెదిరింపులకు దిగుతున్నారు.

Garbage Tax Burden on AP People : పన్నుల విషయంలో జగన్ మార్కు బాదుడే బాదుడుతో ఇప్పటికే సతమతమవుతున్న జనానికి చెత్తకు యూజర్‌ ఛార్జీలు వసూలు చేయడం మరో అదనపు భారంగా తయారైంది. చెల్లించకుంటే వివిధ రకాలుగా భయపెట్టి ఒత్తిడి తెస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో మిగిలిన రాష్ట్రాల సంపద సృష్టిస్తుంటే జగన్‌ ప్రభుత్వం అలాంటి దారుల్ని వదిలేసి 'వేసేయ్‌ పన్ను, దోచేయ్‌ సొమ్ము' అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినా వెనక్కి తగ్గడం లేదు.

Tax Increase: వరుస పన్నుల బాదుడుతో బెంబేలెత్తుతున్న విజయవాడ వాసులు

CM Jagan Government To Collected Garbage Tax : చెత్త పన్ను కట్టకుంటే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని వాలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారు. దుకాణాల ముందు చెత్త వేసి వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చెత్త సేకరిస్తున్నందుకు ప్రజల నుంచి 30 నుంచి 120 రూపాయల వరకు, వ్యాపారులైతే 60 నుంచి కేటగిరినీ బట్టి 5 వేల వరకు రుసుములు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలు, వ్యాపారులపై ప్రభుత్వం ఏటా 165 కోట్ల భారం మోపుతోంది.

People Fire on CM Jagan : ఒక ప్రైవేటు సంస్థకు ఆర్థికంగా మేలు చేకూర్చేందుకే ఇళ్ల నుంచి చెత్త సేకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థ ద్వారా తొలి విడతగా 42 పుర, నగరపాలక సంస్థలకు 2,146 ఆటోలు పంపిణీ చేయించారు. ఇందుకోసం ఒక్కో ఆటోకి నెలకు 62 వేలు చొప్పున మొత్తం 13.3 కోట్లు స్థానిక సంస్థలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేసినా? చేయకపోయినా? ప్రైవేటు సంస్థకు ప్రతి నెలా డబ్బు చెల్లించాలి. ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు సచివాలయాల ఉద్యోగులకు లక్ష్యాలు విధించడంతో వాలంటీర్ల ద్వారా ప్రజలను, చిరు వ్యాపారులను భయపెట్టి వినియోగ రుసుములు చెల్లించాలని ఒత్తిడి పెంచుతున్నారు.

చెత్త పన్ను కట్టలేదని.. పింఛన్ డబ్బు కత్తిరించారు..!

Garbage Tax Pay in AP: ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గతేడాది జులైలో పలువురు వృద్ధులకు ఇచ్చే పింఛన్‌ నుంచి వినియోగ రుసుముల బకాయిలను సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు మినహాయించారు. పింఛన్ల నుంచి వినియోగ రుసుములు మినహాయించి వారిని ఇబ్బంది పెట్టొద్దని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా అధికారులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. దీంతో అధికారులు ప్రత్యేకించి వార్డు సచివాలయాల్లోని వార్డు శానిటరీ కార్యదర్శులకు లక్ష్యాలను నిర్దేశించడం మొదలు పెట్టారు. గడువులోగా రుసుములు వసూలు చేయనందుకు కాకినాడలో ముగ్గురు కార్యదర్శులను గతేడాది ఫిబ్రవరిలో సస్పెండ్‌ చేయడం దుమారం రేపింది. ఇప్పటికీ కార్యదర్శులపై అధికారులు ఒత్తిడి చేస్తూనే ఉన్నారు.

YSRCP Leaders Against on Garbage Tax : చెత్త సేకరణపై ఇళ్ల నుంచి వినియోగ రుసుముల వసూళ్లను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడప నగరపాలక సంస్థలో రుసుముల వసూళ్లపై వైకాపా ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఏడాది క్రితమే అభ్యంతరం చెప్పారు. నగరపాలక సర్వసభ్య సమావేశాల్లో పొల్గొన్నప్పుడు రుసుముల వసూళ్లు నిలిపివేయాలని అధికారులకు సూచించారు. అధికార పార్టీ కార్పొరేటర్లు కూడా ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్నందున.. వసూళ్లు నిలిపివేయాలని మేయర్‌ సురేశ్‌బాబుకి వినతిపత్రం ఇచ్చారు. అయినా ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడటం లేదు.

AP PEOPLE ANGRY ON GARBAGE TAX: ప్రభుత్వానిది "చెత్త" నిర్ణయం.. పన్ను రద్దుచేయాలంటున్న జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.