ETV Bharat / state

స్థానిక పోరులో అక్రమాలపై ఎస్​ఈసీకి.. భూమా అఖిలప్రియ ఫిర్యాదు

author img

By

Published : Feb 11, 2021, 8:39 PM IST

కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. ఎస్​ఈసీకి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డలో వైకాపా నేతల అరాచకాలు, బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆమె తెలిపారు.

bhuma akhilapriya complaint to sec in vijayawada
స్థానిక పోరులో అక్రమాలపై ఎస్​ఈసీకి భూమా అఖిలప్రియ విజయవాడలో ఫిర్యాదు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్​ను తెదేపా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విజయవాడలో కలిశారు. కర్నూలు జిల్లా పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.

ఆళ్లగడ్డలో వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని అఖిలప్రియ ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల అరాచకాలపై ఎస్ఈసీకి పూర్తిగా వివరించానని చెప్పారు. తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం: చంద్రబాబు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.