ETV Bharat / state

కుళాయి గుంతలో పడి.. 11 నెలల బాలుడు మృతి

author img

By

Published : Mar 19, 2021, 10:38 PM IST

ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న నందకిషోర్ అనే 11 నెలల బాలుడు.. కుళాయి గుంతలో పడి మరణించాడు. కర్నూలు జిల్లా ఆదోనిలోని ఇంద్ర నగర్​లో ఈ ఘటన జరిగింది.

kid dead by falling in water tap hole at adoni
ఆదోనిలో కుళాయి గుంతలో పడి 11 నెలల బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోనిలోని ఇంద్ర నగర్​లో దారుణం జరిగింది. నందకిషోర్ అనే 11 నెలల చిన్నారి.. ఆడుకుంటూ నీటి గుంతలో పడి మరణించాడు. బాలుడి మృతితో తల్లి తండ్రులు హుస్సేన్, రోజా కన్నీరుమున్నీరు అయ్యారు.

సాయంత్రం ఇంటి ఆవరణలో నందకిషోర్ ఆడుకుంటున్నాడు. అనుకోకుండా పక్కనే ఉన్న కుళాయి గుంతలో పడి పోయాడు. ఎవరూ గమనించకపోవడంతో.. బాలుడు గుంతలోనే శవమై తేలినట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:

కర్నూలు విమానాశ్రయ ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.