ETV Bharat / state

వైకాపా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Dec 15, 2020, 5:01 PM IST

Updated : Dec 15, 2020, 6:54 PM IST

వైకాపా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మొగిలిచర్ల జోజి బాబు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ.. ఆయన ప్రధాన అనుచరులు వేదింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆరోపించాడు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డానని.. అలాంటి తనను ఎమ్మెల్యే వంశీ, పార్టీ నేత కోట్లు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ysrcp cell district secretary commits suicide
వైకాపా సెల్ జిల్లా కార్యదర్శి మొగిలిచర్ల జోజి బాబు ఆత్మహత్యయత్నం

వైకాపా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మొగిలిచర్ల జోజి బాబు ఆత్మహత్యయత్నం

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో దళితులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ వైకాపా ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి జోజిబాబు.. ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు. పక్కనే ఉన్నవారు అడ్డుకున్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వంశీ.. ఆయన ప్రధాన అనుచరులు వేదింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆరోపించాడు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డానని.. అలాంటి తనను ఎమ్మెల్యే వంశీ, పార్టీ నేత కోట్లు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దళితులకు రావాల్సిన కాంట్రాక్టు పనుల్ని అడ్డుకోవడంతో పాటు.. బిల్లులు కూడా చెల్లించవద్దని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని జోజిబాబు ఆరోపించారు.

ఇవీ చూడండి...

'వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష' ఏర్పాట్ల పరిశీలన

Last Updated : Dec 15, 2020, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.