ETV Bharat / state

రాజ్​భవన్​లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

author img

By

Published : Mar 8, 2021, 3:43 PM IST

Updated : Mar 8, 2021, 6:03 PM IST

విజయవాడ రాజ్​భవన్​లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ సతీమణి సుప్రవ హరిచందన్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి రాజ్​భవన్ మహిళా ఉద్యోగులకు స్వయంగా అందించారు.

రాజ్ భవన్​లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజ్ భవన్​లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

రాజ్ భవన్​లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజ్ భవన్​లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అవకాశాలు లభిస్తే మహిళలు అన్ని రంగాల్లోనూ మగవారితో సమానంగా పోటీపడతారని గవర్నర్ సతీమణి, రాష్ట్ర ప్రథమ పౌరురాలు సుప్రవ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్​భవన్​లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన రాజ్​భవన్ మహిళా ఉద్యోగులకు సుప్రవ హరిచందన్ బహుమతులు అందజేశారు. కేక్ కట్ చేసి ఉద్యోగులకు స్వయంగా అందించారు. ఈ సంతోషకరమైన క్షణాలను అందరితో పంచుకోవడానికి తనకు అవకాశం లభించటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్​భవన్ సంయుక్త కార్యదర్శి నాగమణి అధ్యక్షత వహించారు.

రాజ్ భవన్​లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజ్ భవన్​లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

రాష్ట్ర ప్రథమ పౌరురాలిని రాజ్​భవన్ మహిళా ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. దేశ అభివృద్ధిలో మహిళలకు సమాన పాత్ర ఉందని ప్రపంచానికి తెలియజేసే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం భావించవచ్చన్నారు. దశాబ్ధాల ఉద్యమాల ఫలితంగా సాధించిన హక్కులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

రాజ్ భవన్​లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజ్ భవన్​లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఇవీ చదవండి

విజయవాడలో భాజపా - జనసేన ర్యాలీ

Last Updated : Mar 8, 2021, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.