ETV Bharat / state

పెళ్లైన 12 రోజులకే వివాహిత ఆత్మహత్య

author img

By

Published : Dec 3, 2020, 7:03 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో.. రాజేశ్వరి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివాహమైన 12 రోజులకే ఈ ఘటన జరగ్గా.. ఇష్టం లేని పెళ్లే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

newly married woman suicide
వివాహిత ఆత్మహత్య

పెళ్లైన 12 రోజులకే.. రాజేశ్వరి అనే వివాహిత స్నానాలగదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో జరిగింది ఈ ఘటన. ఇష్టం లేని వివాహం కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాజేశ్వరి స్వగ్రామం మైలవరం మండలం గణపవరం. ద్వితీయ సంవత్సరం ఇంటర్ చదువుతుండగా.. లాక్​డౌన్​లో ఆమె తల్లితండ్రులు చదువు మాన్పించి, వివాహం చేశారు. అనుకోని ఈ ఘటనతో.. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి:

ఎస్పీకి వచ్చిన అనుమానమే నాకూ వచ్చింది: కొల్లు రవీంద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.