ETV Bharat / state

'ఒప్పంద సిబ్బందిని క్రమబద్దీకరించాలి'

author img

By

Published : Jun 8, 2020, 12:39 AM IST

ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఒప్పంద సిబ్బందిని, ఎఎన్ఎంలను క్రమబద్దీకరించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ వుమెన్ హెల్త్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి. జయలక్ష్మీ డిమాండ్ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న వి. జయలక్ష్మీ
సమావేశంలో మాట్లాడుతున్న వి. జయలక్ష్మీ

ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఎఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ వుమెన్ హెల్త్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి. జయలక్ష్మీ డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా కంకిపాడులో ఆమె మాట్లాడుతూ... గత 18 ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఇప్పటికీ క్రమబద్దీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 28 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారు కూడా ఏఎన్ఎంలుగానే పదవీ విరమణ చేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టిన వారికి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఎన్‌ఎంలకు పదోన్నతి కల్పించి వారిని ఆర్ డి కార్యాలయంలో నియమించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమగోడు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి: జగన్ గారూ....దిశ చట్టం దిశ తప్పిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.