ETV Bharat / state

చంద్రబాబుకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు: వర్ల రామయ్య

author img

By

Published : Nov 8, 2022, 1:55 PM IST

VARLA LETTER TO DGP ON CBN INCIDENT : తెదేపా అధినేత చంద్రబాబుకు సరైన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆ పార్టీ పొలిట్​ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. బాబు పర్యటనలో భద్రతా లోపాలకు కారణమైన డీఎస్పీ, సీఐ తదితరులను సస్పెండ్​ చేసి సరైన సెక్షన్లతో కేసు నమోదు చేయాలని డీజీపీకి లేఖ రాశారు.

VARLA LETTER TO DGP ON CBN INCIDENT
VARLA LETTER TO DGP ON CBN INCIDENT

TDP VARLA LETTER TO DGP : ప్రతిపక్షనేతకు సరైన భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు విఫలమయ్యారంటూ డీజీపీకి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. చంద్రబాబుపై కుట్రపూరితంగా దాడి చేసి, ఒక పోలీసు అధికారికి గాయాలైనప్పటికీ.. హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు. చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలకు కారణమైన డీఎస్పీ, సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేసి సరైన సెక్షన్లతో తిరిగి కేసు నమోదు చేసి నిందితులకు శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు.

2019 ఆగష్టులో జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రతలో చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరాలు ఎగరవేయటం, అదే ఏడాది అమరావతి రాజధానికి చేపట్టిన బస్సు యాత్రపై రాళ్లు, కర్రలు రువ్వటం, 2021 నవంబర్​లో అధికారపార్టీ ఎమ్మెల్యే.. ప్రతిపక్షనేత ఇంటిపై దాడికి యత్నించటం వంటి సంఘటనలు గుర్తు చేసిన వర్ల .. వాటిపై ఇంత వరకూ చర్యలు లేకపోవటాన్ని తప్పుబట్టారు. తాజాగా నందిగామలో రోడ్ షోకు ముందుగానే అనుమతులు తీసుకున్నప్పటికీ తగినంత భద్రత ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. రాళ్ల దాడి ముందుగానే ప్రణాళిక ప్రకారం జరిగిందనడానికి దాడి చేసే ముందు విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటనను వర్ల తన లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.