ETV Bharat / state

'బీఐఎస్' హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి

author img

By

Published : Aug 3, 2020, 1:17 AM IST

రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు ఎక్కువగా మరణిస్తుంటారు. శిరస్త్రాణం ధరించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని పోలీసులు చెప్తున్నారు. అయితే కొంతమంది హెల్మెట్ పెట్టుకున్నా అవి వారి ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి. ఇందుకు అవి నాణ్యతగా లేకపోవడమే అని అధికారులు అంటున్నారు. అందుకే బీఐఎస్ చట్టం-2016 నిబంధనల ప్రకారం తయారుచేసిన శిరస్త్రాణాలు వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు.

use bis standard helmets while two wheeler travellers
'బీఐఎస్' హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి

ద్విచక్రవాహనదారులకు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు హెల్మెట్ ఉపయోగపడుతుంది. శిరస్త్రాణాలు ధరించాలని పోలీసులు పదేపదే చెప్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. పర్యవసానంగా ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించడం వలన ప్రాణాలు దక్కించుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే శిరస్త్రాణం ధరించినా.. అవి సరిగ్గా లేకపోవటంతో మృతిచెందిన కేసులూ ఉన్నాయి.

ఐసీఐసీఐ లాంబార్డ్ అనే సంస్థ దేశవ్యాప్తంగా 18 నగరాల్లో నిర్వహించిన సర్వేలో హెల్మెట్ వినియోగంలో విజయవాడ ఆఖరిస్థానంలో ఉంది. హైదరాబాద్ 14వ స్థానంలో ఉండగా.. దిల్లీ, ముంబయి, బెంగళూరు వరుసగా 1,2,4 స్థానాలను దక్కించుకున్నాయి.

రోడ్డుప్రమాదాల్లో మరణాలను తగ్గించాలంటే శిరస్త్రాణం తప్పనిసరి. అయితే అవి కూడా నాణ్యమైనవిగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. దీనిపై కేంద్రప్రభుత్వం తాజాగా గైడ్ లైన్స్​ జారీచేసింది. వాహనదారులు కచ్చితంగా 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్' నిబంధనలు పాటించి తయారుచేసిన హెల్మెట్​లనే వాడాలని సూచించింది.

బీఐఎస్-2016 నిబంధనల ప్రకారం హెల్మెట్ ప్రమాణాలు

  • హెల్మెట్ బరువు 1.2 కేజీలు ఉండాలి.
  • ఐఎస్ఐ మార్క్ ఉండాలి
  • తల వెనుక భాగం పూర్తిగా కప్పి ఉంచేలా ఉండాలి.
  • ద్విచక్రవాహనం కోసం తయారుచేసిన శిరస్త్రాణాన్నే వాడాలి. వేరేది ఉపయోగించకూడదు.

ఇకనుంచి ఈ ప్రమాణాలు ఉన్న హెల్మెట్​లే వాడాలని పోలీసులు చెప్తున్నారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చదవండి...

వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన ఆధారంగా బన్నీ సినిమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.