ETV Bharat / state

శ్రీ వనవలమ్మ అమ్మవారి ఆలయంలో మళ్లీ దొంగల బీభత్సం!

author img

By

Published : Jul 10, 2021, 1:15 PM IST

కృష్ణా జిల్లాలోని నాదేళ్లవారిపాలెం గ్రామంలో శ్రీ వనవలమ్మ అమ్మవారి ఆలయంలో దొంగతనం జరిగింది. దేవస్థానం హుండీలోని సొమ్మును దుండగులు దోచుకెళ్లారు. జనవరి నెలలోనూ ఈ ఆలయంలో చోరీ అయ్యిందని.. ఆ నిందితులనే పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేదని గ్రామస్థులు ఆగ్రహించారు.

theft
దొంగతనం

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నాదెళ్లవారిపాలెం గ్రామంలో శ్రీ వనవలమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. దేవస్థానం హుండీలోని సొమ్మును దుండగులు దోచుకెళ్లారు. ఆలయ అర్చకుడు మేడేపల్లి నాగ సుబ్బారావు ఉదయం వచ్చి చూసేసరికి హుండీ గేటు దగ్గర ఉండటం, హుండీ తెరచి ఉండటం గమనించి చల్లపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

జనవరి నెలలోనూ ఈ ఆలయంలో దొంగతనం జరగ్గా... నిందితులను పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేదని గ్రామస్థులు తెలిపారు. గేటు తాళం తీయకుండా హుండీని గేటు దగ్గరకు లాగి.. సొమ్ము దొంగతనం చేస్తున్న దొంగలను పోలీస్ డాగ్ స్క్వాడ్ సాయంతోనైనా పట్టుకోవాలని గ్రామస్థులు కోరారు.

ఇదీ చదవండి:

nara lokesh: 'జగన్‌ తన బంధువులను రాబందుల్లా మన్యంపైకి వదిలారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.