ETV Bharat / state

ప్రధానే చెప్పినా.. వైకాపా ఎందుకు పోరాడటం లేదు - ఎంపీ కనకమేడల

author img

By

Published : Feb 11, 2022, 6:19 PM IST

విభజన హామీలపై వైకాపా ఎందుకు పోరాడటం లేదని ఎంపీ కనకమేడల ప్రశ్నించారు. కేసులకు భయపడి రాష్ట్ర భవిష్యత్​ను తాకట్టు పెడతారా..? అని ముఖ్యమంత్రి జగన్​ను నిలదీశారు.

TDP MP Kanakamedala Ravindra Kumar
TDP MP Kanakamedala Ravindra Kumar

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెదేపా ఎంపీ కనకమేడల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ విభజన అన్యాయంగా జరిగిందని స్వయంగా ప్రధానే చెప్పినా.. వైకాపా ఎందుకు పోరాడడంలేదని ప్రశ్నించారు. దిల్లీలో మాట్లాడిన ఆయన.. కేసుల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెడతారా? అని నిలదీశారు.

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్‌ విభజనపై గత మంగళవారం(ఫిబ్రవరి 8) రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్‌ సభ్యులు పెప్పర్‌ స్ప్రే వాడారన్నారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని వ్యాఖ్యనించారు.

తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్న మోదీ.. ఏపీని కాంగ్రెస్‌ విభజించిన తీరు సరికాదన్నారు. కాంగ్రెస్‌ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని ఆక్షేపించారు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని.. కానీ ఎవరికీ నష్టం కలగకుండా శాంతియుత వాతావరణంలో రాష్ట్రాల ఏర్పాటు జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్​ను సరిగ్గా విభజన చేసి ఉంటే సమస్యలు వచ్చేవి కావని అన్నారు. ప్రధాని వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఎంపీ కనకమేడల.. వైకాపా సర్కార్ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇదీ చదవండి:

Perni nani meets mohanbabu: సినీ నటుడు మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.