ETV Bharat / state

వైకాపా నేతలు రాజకీయ కామర్లతో బాధపడుతున్నారు: గొట్టిపాటి రామకృష్ణ

author img

By

Published : Jun 24, 2020, 7:39 PM IST

వ్యక్తి హక్కుని ప్రభుత్వమే హరించేలా వ్యవహరించడం దారుణమని తెదేపా అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే దేశ ద్రోహం కింద కేసు పెడుతున్నారని... వ్యతిరేకంగా పోస్టు పెడితే కేసులు పెడతామంటే దేశంలోని ప్రజలంతా జైల్లలోనే ఉండాలని మండిపడ్డారు.

tdp leader gottipati ramakrishna fires on ycp government
వైకాపాపై మండిపడ్డ తెదేపా నేత గొట్టిపాటి

వ్యక్తి హక్కుని ప్రభుత్వమే హరించేలా వ్యవహరించడం దారుణమని తెదేపా అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వ విధానాలను కోర్టులు తప్పుబట్టినా మార్పురావడం లేదన్నారు. ఐటీ యాక్ట్ 2005 66(ఏ) వ్యక్తి స్వేచ్ఛను హరిస్తోందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

సోషల్ మీడియాలో పోస్టు పెడితే దేశ ద్రోహం కింద కేసు పెడుతున్నారని... వ్యతిరేకంగా పోస్టు పెడితే కేసులు పెడతామంటే దేశంలోని ప్రజలంతా జైల్లలోనే ఉండాలని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎందుకింత అభద్రతా భావమని ప్రశ్నించారు.

వైకాపా నేతలు రాజకీయ కామర్లతో బాధపడుతున్నారని విమర్శించారు. కోర్టుల తీర్పులను ప్రభుత్వ పెద్దలు, అధికారులు చదువుతున్నారా అని నిలదీశారు.

ఇదీ చదవండి:

'వీడియో ఫుటేజీలు బయటపెట్టండి.. మా తప్పుంటే రాజీనామా చేస్తాం'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.