గ్రామస్థుల సహకారంతో స్వచ్ఛత - పరిశుభ్రత కార్యక్రమాలు

author img

By

Published : Apr 11, 2021, 10:59 AM IST

swacha yarlagadda program

పల్లెలు స్వచ్ఛత వైపు పరుగులు తీస్తున్నాయి. గ్రామాల్లో బహిరంగ మల విసర్జన అరికట్టి పరిశుభ్రత దిశగా అడుగులు పడుతున్నాయి. తడి, పొడి చెత్త వేరుచేసి.. వాటి ద్వారా సంపద సృష్టికి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి.. వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవటం, చిన్నారుల నుంచి వృద్ధులు వరకు రోజూ రోడ్లు శుభ్రం చేయటంలో పాలుపంచుకోవటం వంటి కార్యక్రమాలు చేస్తున్న పింగళి వెంకయ్య స్వగ్రామమైన యార్లగడ్డలో స్వచ్ఛతపై ప్రత్యేక కథనం...

కృష్ణాజిల్లా చల్లపల్లిలో 'స్వచ్ఛ చల్లపల్లి' పేరుతో చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని చుట్టు పక్కల పల్లెలు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నాయి. చల్లపల్లి మండలంలోని యార్లగడ్డ గ్రామంలో 544 రోజులుగా స్వచ్ఛత పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వీధులు శుభ్రం చేయటం, ప్రతి ఇంటి చెత్తను సేకరించడం, గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. వాటికి ప్రతిరోజు ట్యాంకర్ ద్వారా వాటికి నీరందిస్తూ..సంరక్షిస్తున్నారు.

స్వచ్ఛ యార్లగడ్డ నిర్వహిస్తున్న గ్రామస్థులు
గ్రామస్థులు స్వచ్చందంగా పనులు చేయడానికి ముందుకు రావడంతో అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలు, ఆహ్లాదకర వాతావరణం చూసి.. అభివృద్ధిలో మేము సైతం అంటూ దేశ విదేశాల్లో ఉన్న దాతలు లక్షలాది రూపాయలు విరాళాలు అందిస్తున్నారు. స్థానికంగా ఉండే 95 సంత్సరాల వృద్ధుడు బొమ్మినేని వెంకట సుబ్బయ్య కూడా రోడ్లు శుభ్రపరిచి, మొక్కలకు నీరు పెడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి: ' గాంధీ పార్క్​ అత్యంత సుందరంగా తీర్చుదిద్దుతాం'విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న యార్లగడ్డ రమేశ్​ బాబు తన స్వగ్రామమైన నెలకు రూ.20 వేలు విరాళంగా అందిస్తున్నారు. స్వచ్ఛ యార్లగడ్డలో భాగస్వామి అవటం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. గ్రామ జనాభా 1700మంది.. ఇప్పటివరకు 2500 మొక్కలు నాటినట్లు వీఆర్వో తూము వెంకటేశ్వర రావు తెలిపారు. స్వచ్ఛ చల్లపల్లి స్ఫూర్తితో స్వచ్ఛ యార్లగడ్డ మొదలు పెట్టామని అన్నారు. ఇంటింటికి చెత్త డబ్బాలు ఇచ్చి.. రోడ్లపై చెత్త వేయకుండా నియంత్రించగలిగామని గ్రామ సర్పంచ్​ తెలిపారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఇప్పుడు గ్రామం స్వచ్ఛంగా ఉంటోందని ఆనందం వ్యక్తం చేశారు.


ఇదీ చదవండి: స్వచ్ఛ హీరోయిన్ : పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టిన హైదరాబాదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.