కృష్ణా జిల్లాలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉంగుటూరు మండలం నందమూరు కూడలికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఉయ్యూరు మండలం వీరవల్లికి చెందిన వివాహితగా పోలీసులు గుర్తించారు. తన భర్త ఉదయం ద్వారకాతిరుమల వెళ్లే బస్సు ఎక్కించగా.. స్థానిక కూడలి వద్ద పిల్లలతో కలిసి వివాహిత దిగింది. అనంతరం పిల్లలతో కలిసి పంట కాలువలో దూకింది. గమనించిన జాలర్లు.. ముగ్గురినీ బయటకు తీశారు. విషాదం ఏంటంటే.. అప్పటికే ఇద్దరు పిల్లలు(బాబు, పాప) మృతి చెందారు. తల్లి క్షేమంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండీ... విషాదం: గోదావరిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య