ETV Bharat / state

AP - TS WATER WAR: 'మెుక్కుబడిగా లేఖలు రాస్తే సరిపోదు'

author img

By

Published : Jul 3, 2021, 6:04 PM IST

నీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెుక్కుబడిగా లేఖలు రాస్తే సరిపోదని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై అవసరమైతే న్యాయపోరాటం చేయాలని సూచించారు.

ap ts water war
సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు

నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని.. ఏపీ ప్రభుత్వం సరైన మార్గంలో అడ్డుకోలేకపోతోందని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు విమర్శించారు. సాగుమడుల్లోకి వెళ్లాల్సిన నీరు సముద్రంలోకి వెళ్తోందన్న ఆయన.. ఇది చాలా ఘోరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించారు.

తెలంగాణ 255 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులతోపాటు, విస్తరణ పనులు చేస్తోందన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించిన నీటిని కంటే అధికంగా వాడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెుక్కుబడిగా లేఖలు రాస్తే సరిపోదని.. అవసరమైతే న్యాయపోరాటం చేయాలని సూచించారు. 2016లో సుంప్రీకోర్టులో తాను రిట్ వేస్తే కేంద్ర ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులని అఫిడవిట్ వేసిందని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవటం లేదని గోపాలకృష్ణారావు ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

Corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,930 కరోనా కేసులు, 36 మరణాలు

విద్యుత్​ కొరతపై ఆందోళన- జలఫిరంగుల ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.