చాట్రాయి మండలంలో తెలంగాణ మద్యం స్వాధీనం

author img

By

Published : May 22, 2020, 6:20 PM IST

krishna distrct

కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో తెలంగాణ నుంచి అక్రమంగా తీసుకువస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావు పాలెం సమీపంలో తెలంగాణ నుంచి నూజివీడుకు అక్రమంగా తీసుకువస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చాట్రాయి ఎస్సై శివన్నారాయణ తెల్లవారుజామున దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి 100 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇది చదవండి ఆన్‌లైన్‌ బాటలో పాఠాలు.. 'ఈ-విద్య'తో ప్రోత్సాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.