కృష్ణా జిల్లా వత్సవాయి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సునీల్ అనే వ్యక్తి తన భార్య నవ్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన నవ్యను ఆమె బంధువులు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నవ్య అక్కడే చికిత్స తీసుకుంటోంది.
వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకే..
సునీల్‌కు జగ్గయ్యపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని నవ్య ఆరోపిస్తోంది. వారికి అడ్డుగా ఉన్నానని తనపై హత్యాయత్నం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన అత్త ప్రోద్బలంతోనే నాపై దాడి చేశారని తెలిపింది. మహిళను కొట్టలేకపోతున్నావా? అని సునీల్‌ను రెచ్చగొట్టిందని.. ఆపై ఏమైనా నేను చూసుకుంటానని..మహిళా సర్పంచ్ అయిన ఆమె చెప్పడంతో సునీల్ తనపై హత్యాయత్నానికి దిగాడని చెప్పింది.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే.. భార్యపై తీవ్రంగా దాడి చేయడాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అతనిపై కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: