ETV Bharat / state

ఒక నెల కరెంటు బిల్లు 40 వేల రూపాయలా...?

author img

By

Published : May 19, 2020, 1:50 PM IST

తనకు ఈ నెల 40 వేల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని తెదేపా నేత బోండా ఉమ తెలిపారు. గత పదేళ్లలో 9 వేలు దాటని విద్యుత్ బిల్లు ఇప్పుడు 40 వేలు రావడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు అనటం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు.

Current Bill In Andhra Pradesh
Current Bill In Andhra Pradesh

గత 10 సవత్సరాల్లో తన ఇంటికి 9 వేలకు మించి కరెంటు బిల్లు రాలేదని తెదేపా అధికార ప్రతినిధి బోండా ఉమ తెలిపారు. అలాంటిది ఇప్పుడు 40 వేల రూపాయలు బిల్లు వచ్చిందన్నారు. గత మార్చి, ఏప్రిల్ నెలలో బిల్లు 9వేలు వస్తే.. ఇప్పుడు 40,000 ఎందుకు వచ్చిందో మంత్రులు చెప్పాలని బోండా ఉమా డిమాండ్‌చేశారు.

విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు అనటం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. లాక్ డౌన్ 60 రోజులు కరెంట్ బిల్లును రద్దు చేయాలని ఆయన డిమాండ్ ‌చేశారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. సీఎం అసమర్థత వల్లే ప్రజలకు ఈ కష్టాలని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

విశాఖ ఎల్జీ ఘటనపై ఫేస్​బుక్​లో పోస్ట్​.. వృద్ధురాలికి అరెస్ట్​ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.