విజయవాడ కృష్ణలంక రెడ్ జోన్ ప్రాంతంలో ప్రజలు రేషన్ సరుకులు తీసుకోవటంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికే సరుకులు పంపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం... మాట నిలబెట్టుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకుతుందేమో అనే భయం కన్నా... రేషన్ అందదేమో అని ఆవేదన చెందుతున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించకుండా, మాస్క్లు ధరించకుండా రేషన్ సరుకుల వాహనం చుట్టూ గుమిగూడారు. ప్రభుత్వం తక్షణమే మాస్కులు అందజేయాలన్నారు.
ఇదీ చదవండి: