ETV Bharat / state

పెండింగ్ బిల్లులు, వేతనాల కోసం మధ్యాహ్న భోజన నిర్వాహకుల ధర్నా

author img

By

Published : Oct 16, 2020, 6:34 PM IST

పోషకాహార లోపంతో కరోనా బారిన పడకుండా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చిక్కీ (పప్పుచక్క) అందించాలంటూ ఏపీ సర్కారు ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రాష్ట్రమంతటా ఈ కార్యక్రమం అమలవుతోంది. విద్యార్థల గురించి ఆలోచించిన ప్రభుత్వం తమను పట్టించుకోలేదని పథక నిర్వాహకులు వాపోతున్నారు. ఐదు నెలల నుంచి తమకు బిల్లులు, వేతనాలు చెల్లించడం లేదంటూ కృష్ణాజిల్లా నందిగామ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

mid day meals workers protest
మధ్యహ్న భోజన పథక నిర్వాహకుల ధర్నా

పెండింగ్​ బిల్లులు తక్షణం విడుదల చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో.. కృష్ణాజిల్లా నందిగామ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మార్చి 22, 2020 వరకు బిల్లులు, వేతనాలు వచ్చాయని.. తర్వాత నుంచి సర్కారు తమను పట్టించుకోలేదని వాపోయారు.

ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు.. లాక్​డౌన్ నుంచి ప్రతిరోజూ చిక్కీ పెట్టాలని అధికారులు ఆదేశించారని కార్మికులు తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసే వారికే గతంలో పెడుతుండగా.. ఇప్పుడు అందరికీ అందించడం తలకు మించిన భారం అవుతోందని పేర్కొన్నారు. వడ్డీకి అప్పులు తెచ్చి సర్దుతున్నా.. ఐదు నెలల నుంచి వాటి బిల్లులు, తమ వేతనాలు చెల్లించకపోవడం దారుణమని వాపోయారు. ప్రభుత్వ పథకమే అయినప్పటికీ.. వంట గ్యాస్​కూ సబ్సిడీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్​గా పాల్గొన్న జగన్​, గడ్కరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.