న్యాయసమీక్షకు మచిలీపట్నం పోర్టు టెండర్లు..

author img

By

Published : Jun 24, 2021, 9:50 AM IST

Machilipatnam port

మచిలీపట్నం పోర్టులో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడానికి వీలుగా రూపొందించిన టెండరు పత్రాలను ఏపీ మారిటైం బోర్డు న్యాయ సమీక్షకు పంపింది. మొదటిసారి పిలిచిన టెండర్లకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో రెండోసారి పిలవాలని నిర్ణయించింది. ఆసక్తి ఉన్న సంస్థలు గుత్తేదారులు పరిశీలన కోసం జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌, ఏపీ మారిటైం బోర్డు వెబ్‌సైట్​లలో అందుబాటులో ఉంచింది.

మచిలీపట్నం పోర్టులో రూ.3,650 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడానికి వీలుగా రూపొందించిన టెండరు పత్రాలను ఏపీ మారిటైం బోర్డు బుధవారం న్యాయ సమీక్షకు పంపింది. మొదటిసారి ఆహ్వానించిన టెండర్లకు నిర్దేశిత వ్యవధి ముగిసినా గుత్తేదారుల నుంచి స్పందన లేకపోవడంతో రెండోసారి పిలవాలని నిర్ణయించింది. టెండరు పత్రాలను ప్రజలు, ఆసక్తి ఉన్న సంస్థలు, గుత్తేదార్ల పరిశీలన కోసం జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌ www.judicialpreview.ap.gov.in , ఏపీ మారిటైం బోర్డు వెబ్‌సైట్‌ ‌www.ports.ap.gov.in లో అందుబాటులో ఉంచింది. టెండర్ల ప్రక్రియపై వారంలోగా అభ్యంతరాలను తెలపాలంది.

పోర్టు అభివృద్ధిలో భాగంగా 2.99 కి.మీ.ల ఆఫ్‌ బ్రేక్‌ వాటర్స్‌, బహుళ వినియోగ బెర్తు, రెండు సాధారణ కార్గో బెర్తులు, బొగ్గు రవాణా కోసం ప్రత్యేక బెర్తుతోపాటు 48.54 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల డ్రెడ్జింగ్‌ పనుల నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాలను గుత్తేదారు సంస్థ అభివృద్ధి చేయాలి. మొదటి దశ పనులను 30 నెలల్లో పూర్తి చేయాలన్న నిబంధనను బోర్డు విధించింది. మొదటిసారి పిలిచిన టెండర్ల ప్రకారం పనులను 36 నెలల్లోగా గుత్తేదారు సంస్థ పూర్తి చేయాలన్న నిబంధన విధించింది.

మొదటి పిలుపునకు స్పందన లేదు...
ఈఏడాది ఏప్రిల్‌ 26న పోర్టు అభివృద్ధికి మారిటైం బోర్డు మొదటిసారి టెండరు పిలిచింది. గుత్తేదారులకు తమ ఆసక్తిని తెలపడానికి ఈనెల 5 వరకు గడువు విధించింది. నిర్దేశిత వ్యవధిలో ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. దీంతో మరోసారి టెండర్లను పిలిచింది. టెండరు పత్రాల్లో పేర్కొన్న కొన్ని నిబంధనలపై గుత్తేదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలిసింది. దీనివల్ల పోర్టు నిర్మాణానికి మొదటిసారి పిలిచిన టెండర్లకు ఎలాంటి స్పందన రాలేదు. వాటిపై బోర్డు అధికారులు పలుమార్లు గుత్తేదారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

సీఎం జగన్‌పై కేసుల ఉపసంహరణ.. సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ

పెట్రో ధరల పెరుగుదల.. ఒక్కో ఎకరాపై రూ.3వేల వరకు భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.