ETV Bharat / state

అధికారపార్టీ భూ దాహానికి గిరిజనులు బలవుతున్నారు: లోకేశ్

author img

By

Published : Aug 13, 2020, 2:20 PM IST

గిరిజన భూముల విషయంలో వైకాపా తీరును తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తప్పుబట్టారు. అధికారపార్టీ భూ దాహానికి గిరిజనులు బలవుతున్నారని ఆరోపించారు. ఆక్రమించుకున్న భూమిని వెంటనే గిరిజన కుటుంబాలకు అందచేయాలని లేకేశ్ డిమాండ్ చేశారు.

lokesh comments
lokesh comments

జగన్ రెడ్డి భూ దాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు . చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు.. 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. ఆ భూమిని కొట్టేయడానికి అధికార పార్టీ నాయకులు దాడికి దిగి 23 మందిని గాయపరిచారని మండిపడ్డారు. గిరిజన యువకుడు డబ్బా బాబ్లీని అత్యంత కిరాతకంగా హత్యచేశారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్న భూమిని వెంటనే గిరిజన కుటుంబాలకు అందచేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. డబ్బా బాబ్లీని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

ఇదీ చదవండి: ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.