ETV Bharat / state

SP RAID : మచిలీపట్నం రైల్వేస్టేషన్​లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

author img

By

Published : Nov 7, 2021, 8:35 PM IST

మచిలీపట్నం రైల్వేస్టేషన్​లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
మచిలీపట్నం రైల్వేస్టేషన్​లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

మచిలీపట్నం రైల్వేస్టేషన్​ను కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆకస్మిక తనిఖీ చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లాలో యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

మచిలీపట్నం రైల్వేస్టేషన్​ను కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్​లో భాగంగా ఈ దాడులు చేసినట్లు ఎస్పీ తెలిపారు. డాగ్ స్క్వాడ్ తో రైల్వేస్టేషన్ ప్రాంగణంతో పాటు సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్​ప్రెస్​లో సోదాలు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లాలో యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అందులో భాగంగా బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ తనిఖీలు నిరంతర ప్రక్రియలా కొనసాగుతాయని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెల్లడించారు.

ఇదీచదవండి: 5K RUN : ఆవార స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కేన్సర్​పై అవగాహన పరుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.