ETV Bharat / state

షఫియుద్దీన్ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు

author img

By

Published : Oct 4, 2019, 9:16 AM IST

పెనమలూరు పీఎస్ పరిధిలో అపహరణకు గురైన ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు విడిపించారు. సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.

షఫియుద్దీన్ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు

షఫియుద్దీన్ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు

కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమైన కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి షఫియుద్దీన్‌ను పోలీసులు క్షేమంగా విడిపించారు. ఈ కిడ్నాప్‌కు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన షఫియుద్దీన్‌ తిరిగి రాలేదు. బుధవారం తెల్లవారుజామున షఫియుద్దీన్ ఫోన్ నుంచి అతని కుమారునికి ఓ ఆగంతుకుడు కాల్ చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని... సెల్ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి

తాగి తూగిన కానిస్టేబుల్.. తరిమేసిన జనం!

AP_HYD_10_04_JUDGE_OPPOINTMENT_AV_DRY_3182388 reporter : sripathi.srinivas Note : ఫోటోను తాజాకు పంపించాను. ( ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జితేంద్ర కుమార్ మహేశ్వరిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. మధ్య ప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మహేశ్వరిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఏపీ హైకోర్టు ఆవిర్భవించిన్నప్పటి నుంచి జస్టిస్ ప్రవీణ్ కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు. ఏపీ హైకోర్టు ఆవిర్భావం తర్వాత రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జేకే మహేశ్వరి నియమించబడ్డారు. 29 జూన్ 1961వ తేదీన జేకే మహేశ్వరి జన్మించారు. 22 నవంబర్ 1985న అడ్వకేట్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కోర్టులో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ విభాగాల్లో ప్రాక్టీస్ చేశారు. 25 నవంబర్ 2005లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. అనంతరం 25 నవంబర్ 2008లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమించబడ్డారు. Look...

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.