ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి.. బాధితుల ఆందోళన

author img

By

Published : Oct 4, 2019, 8:21 PM IST

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని తిరువూరు ప్రాంతీయ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తల్లికి జ్వరం రావడం వల్లే బిడ్డ చనిపోయిందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రికి వచ్చి బాధితులకు సంఘీభావం తెలిపి సర్దిచెప్పారు.

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి.. బాధితుల ఆరోపణ

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి.. బాధితుల ఆందోళన

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కృష్ణాజిల్లా తిరువూరు ప్రాంతీయ వైద్యశాల ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని కొమిరెడ్డిపల్లికి చెందిన మహిళను కాన్పు నిమిత్తం కుటుంబ సభ్యులు 5 రోజుల క్రితం తిరువూరు ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 2న ఆపరేషన్ చేయాల్సి ఉండగా... గాంధీ జయంతి పేరిట వైద్యులు విధులకు హాజరు కాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హడావిడిగా శుక్రవారం వైద్యం చేయడం వలన శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ... ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రక్షణనిధి... ఆసుపత్రికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. శిశువు మరణించడానికి కారణాలపై ఆరా తీశారు. తల్లి జ్వరంతో బాధపడటం వల్లే శిశువు చనిపోయిందని వైద్యులు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే సర్దిచెప్పటంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు.

ఇదీ చదవండి :

తండ్రిపై పోలీసులకు ఎనిమిదేళ్ల బాలుడు ఫిర్యాదు

Intro:ap_vja_36_04_sisuvu_mruthi_dharna_tiruvuru_av_ap10125

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కృష్ణాజిల్లా తిరువూరు ప్రాంతీయ వైద్యశాల ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు మండలంలోని కొమిరెడ్డి పల్లి కి చెందిన స్వప్నను మొదటి కాన్పు నిమిత్తం కుటుంబ సభ్యులు 5 రోజుల క్రితం కాన్పు నిమిత్తం ప్రాంతీయ వైద్యశాల లో చేర్చారు వాస్తవంగా ఈ నెల 2న కాన్పు చేయాల్సి ఉండగా గాంధీ జయంతి పేరిట వైద్యులు విధులకు హాజరు కాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు హడావిడిగా ఈరోజు కాన్పు చేయడం వల్ల శిశువు ముంచిందని దీనికి వైద్య నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు వైద్యశాల ఎదుట ఆందోళన చేపట్టారు సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రక్షణ నిధి వైద్యశాల చేరుకొని బాధితులతో మాట్లాడారు కాన్పు చేసిన వైద్యురాలు కార్తికా నూ శిశువు మృతి చెందిన కారణాల గురించి ఆరా తీశారు తల్లి జ్వరంతో బాధపడటం వల్ల కాన్పు నిమిత్తం తర్వాత చనిపోయిందని ఆమె వివరణ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే సర్దిచెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కాన్పుచేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు


Body:డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యుల ఆందోళన


Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్: 8008574709
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.