ETV Bharat / state

Hostels Construction Stalled in Krishna University: కృష్ణా విశ్వవిద్యాలయంలో ప్రశ్నార్థకంగా వసతి గృహాల నిర్మాణం.. విద్యార్థులపై ఆర్థిక భారం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 1:29 PM IST

Updated : Sep 3, 2023, 2:31 PM IST

Hostels Construction Stalled in Krishna University: కృష్ణా విశ్వవిద్యాలయంలో వసతి గృహాల నిర్మాణం ఎక్కడివక్కడే ఆగిపోయాయి. నిర్మాణాలు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం పునాదుల దశలోనే నిలిచిపోయాయి. వసతి గృహాలు లేకపోవడంతో యూనివర్సిటీలో చదివేందుకు విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు.

Hostels_Construction_Stalled_in_Krishna_University
Hostels_Construction_Stalled_in_Krishna_University

Hostels Construction Stalled in Krishna University: కృష్ణా విశ్వవిద్యాలయంలో ప్రశ్నార్థకంగా వసతి గృహాల నిర్మాణం.. విద్యార్థులపై ఆర్థిక భారం

Hostels Construction Stalled in Krishna University : కృష్ణా విశ్వవిద్యాలయంలో విద్యార్ధులు వసతి గృహాల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై బేస్​మెంట్ స్థాయి (Krishna University Hostels at Pillar Level) వరకు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకే తలమానికంగా ఉన్న కృష్ణా విశ్వవిద్యాలయంలో విద్యార్ధులకు సంబంధించిన వసతి గృహాల నిర్మాణాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. వసతి గృహాలు లేకపోవడం కారణంగా వర్సిటీలో చేరేందుకు దూర ప్రాంత విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు.

Financial Burden on Krishna University Students : గత మూడేళ్లుగా ఇదిగో వసతులు.. అవిగో వసతి గృహాలు అంటూ చెబుతున్నారే తప్ప ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమైనా ఇప్పటికీ అనేక భవనాలు పునాదుల దశలో ఆగిపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్ధులు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో అద్దెలకు ఉండి చదువుకుంటున్నారు. బయట వసతి గృహాల్లో ఉంటూ చదువుతున్న విద్యార్ధులు అద్దెలు, భోజనానికి, ఇతర ఖర్చులకు నెలకు 10 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

Government Hostel Problems: శిథిలావస్థకు హాస్టళ్లు​.. ప్రాణభయంతో విద్యార్థులు

విశ్వ విద్యాలయంలో విద్యను అభ్యసించే వారు ఎక్కువగా సామాన్య, మధ్యతరగతి వారే ఉంటారు. ప్రభుత్వం నిర్వాకం వల్ల వారు ఆర్ధిక భారాన్ని ఎదుర్కొంటున్నారు. విశ్వవిద్యాయానికి నిధులు అందుబాటులో ఉన్నా అధికారులు ఎందుకు ఈ వసతి గృహాల నిర్మాణం పూర్తి చేయడం లేదని విద్యార్ధి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

Development Works Stopped in Krishna University : కృష్ణా విశ్వ విద్యాలయం పరిధిలో ఉమ్మడి జిల్లాలో 175 డిగ్రీ కళాశాలలు, 25 పీజీ సెంటర్లు, 18 బీఈడీ కళాశాలు అనుబంధంగా నడుస్తున్నాయి. దాదాపు 60 నుంచి 70 వేల మంది విద్యార్ధులు ఈ విశ్వ విద్యాలయ పరిధిలో చదువుకుంటున్నారు. విశ్వవిద్యాలయంలో యువతి, యువకులకు వేర్వేరుగా వసతి గృహాలు నిర్మించేందుకు 18 కోట్లు కేటాయించారు. ఒక్కో వసతి గృహంలో 500 నుంచి 600 మంది విద్యార్థుల వరకు ఉండేలా భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిధులు కూడా కేటాయించారు. ఇది జరిగి రెండున్నరేళ్లు దాటినా ఇంతవరకు నిర్మాణాలు పూర్తి చేయలేదు.

పనులు ఆలస్యంగా ప్రారంభించడం, గుత్తేదారులు సరిగా స్పందించకపోవడంతో ప్రారంభం నుంచి పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. ప్రస్తుతం పనులు ఆగిపోయి మూడు నెలలైంది. తిరిగి ప్రారంభిస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. విశ్వవిద్యాలయానికి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగి విద్యార్ధులు చనిపోతున్నారు. విశ్వవిద్యాలయంలో సౌకర్యాల లేమితో పాటు వర్సీటికి వెళ్లే రోడ్డు గుంతలయమంగా మారడంతో విద్యార్ధులు నరకం చూస్తున్నారు. యూనివర్సీటిలో పాలన దారుణంగా ఉందని, విద్యార్ధులకు సౌకర్యాలు లేక వారు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్ధి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Social Welfare Hostels Problems: నీళ్ల పప్పు.. పురుగుల అన్నం.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల అవస్థలు

గతేడాది డిసెంబరు నాటికి వసతి గృహాల నిర్మాణాలు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికి కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. బాల, బాలికల వసతి గృహాలు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. కేవలం వసతి గృహాలే కాదు 6 కోట్లతో ఫార్మసీ కళాశాల, 8 కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభించారు. అట్టహాసంగా పనులు ప్రారంభించినా అవి కూడా ఆగిపోయాయి. వర్శిటీ ప్రాంగఃణంలోనే విద్యార్థులతో పాటు సందర్శకులకు ఉపయోగపడేలా ఫుడ్ కోర్టు నిర్మించేందుకు 150 కోట్లు కేటాయించారు. ఈ పనులు కూడా అసంపూర్తిగానే ఉండి పోయాయి.

కొత్తగా నిర్మించిన విశ్వవిద్యాలయ భవనాల్లో బోధన ప్రారంభించి సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంత వరకు చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టలేదు. విశ్వవిద్యాలయ ముఖద్వారం నిర్మాణాలకు 50 కోట్లు కేటాయించారు. కొన్ని చోట్ల దిమ్మలు ఏర్పాటు చేసి వదిలేయగా ఇంకొన్ని చోట్ల ఆవి కూడా కనిపించడం లేదు. ఇలా విశ్వవిద్యాలయంలో దాదాపు 50 కోట్లతో చేపట్టిన పనులు ఆగిపోయాయి. గుత్తేదారు అదనంగా నిధులు కేటాయించాలని అడగడంతో నిర్మాణాలు నిలిచిపోయాయని సమాచారం.

విద్యార్ధి సంఘాల డిమాండ్ : విద్యార్ధులకు మౌళిక సదుపాయాలు కల్పించడంలో అధికారులకు చిత్తశుద్ది లేదని విద్యార్ధి సంఘాల నేతల మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

SV University Students Protest ఎస్వీ యూనివర్సిటీ హాస్టల్ టిఫిన్​లో జెర్రి.. విద్యార్థుల ధర్నా

Last Updated : Sep 3, 2023, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.