ETV Bharat / state

ఊళ్లు చుట్టూ నీళ్లు ... బయటకు వెళ్లేందుకు లేవు దారులు

author img

By

Published : Oct 13, 2020, 1:40 PM IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వివిధ వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలు నీటిలో మునిగిపోయి.. చెరువులను తలపిస్తున్నాయి. కృష్ణాజిల్లాలోని నందిగామ, చాట్రాయి మండలాల్లో అనేక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. రోడ్ల మీద మోకాళ్లకు పైగా నీరు చేరడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి.

heavy rains
భారీ వర్షాలు

కృష్ణాజిల్లా నందిగామ మండలంలోని పలు రహదారులు జలమయ్యాయి. డీవీఆర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దినసరి కూలీలు బయట ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. మోకాళ్ల లోతు నీటిలో ఎటూ కదలలేని పరిస్థితి నెలకొంది.

భారీ వర్షాలు

చాట్రాయి మండలంలోని పోలవరం పూర్తిగా జలమయమైంది. నలువైపుల ఉన్న వాగులు పొంగి.. రోడ్లమీద భారీ స్థాయిలో నీరు చేరింది. గ్రామం ద్వీపకల్పాన్ని తలపిస్తుండటంతో.. బ్యాంకులు, కార్యాలయాలకు సిబ్బంది చేరుకునే పరిస్థితి లేదు. అధికారులు వరదనీటిని మళ్లించి రాకపోకలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

తమ్మిలేరు జలాశయానికి ప్రవాహం పెరగగా.. చిన్నంపేట వద్ద నీటి ఉద్ధృతి పెరిగింది. ఐదు వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 2500 క్యూసెక్కులను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వంతెన మీద నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి: వాయుగుండం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.