ETV Bharat / state

రైతుల అక్రమ అరెస్టులను ఖండించిన లోకేశ్

author img

By

Published : Jan 20, 2020, 5:25 PM IST

అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్టయిన రైతులను పోలీసులు విడుదల చేశారు. లోకేశ్​ రైతులకు అండగా అమరావతి పోలీసు స్టేషన్​కు వెళ్లి పరామర్శించారు.

అసెంబ్లీ మట్టడిలో  అరెస్టైన రైతులు విడుదల
లోకేశ్

రైతుల అక్రమ అరెస్టులను ఖండించిన లోకేశ్

అమరావతి రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. తుళ్లూరులో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులను పోలీసులు అరెస్టు చేసి అమరావతి పోలీసు స్టేషన్​కు తరలించారు. విషయం తెలుసుకున్న లోకేశ్​ అమరావతి స్టేషన్​కు వచ్చి రైతులను పరామర్శించారు. రైతుల అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అక్రమంగా అరెస్టు చేశారని రైతులు లోకేశ్​ వద్ద వాపోయారు. మూడు రాజధానులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని.. శాసనమండలిలో ఆ బిల్లును అడ్డుకుంటామని లోకేశ్​ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్న వైకాపా ఇప్పుడు ఎందుకు రాజధాని మారుస్తుందని ప్రశ్నించారు.

ఇవీ చదవండి

అసెంబ్లీ మట్టడికి బయల్దేరిన ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.