ETV Bharat / state

ఎడతెరిపి లేని వర్షాలు.. ఆందోళనలో రైతులు

author img

By

Published : Jul 15, 2020, 10:30 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. పత్తి, మొక్కజొన్న, పెసర, మిర్చి సాగు చేస్తున్న రైతులు.. మొక్కలు మొలకెత్తుతున్న తరుణంలో వర్షాలు పడటం వల్ల వేర్లు కుళ్లిపోతాయని ఆందోళన చెందుతున్నారు.

farmers suffering from heavy rains
వర్షాలకు పోలాల్లో చేరిన నీరు

కృష్ణా జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మెట్ట పైర్లు దెబ్బతింటున్నాయి. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో తొలకరి వర్షాలకు పత్తి, మొక్కజొన్న, పెసర, మిర్చిని రైతులు సాగు చేశారు. విత్తనాలు పూర్తిగా మొలకెత్తి ఆశాజనకంగా ఉన్న సమయంలో విరామం లేకుండా వర్షాలు పడుతుండడం.. రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. పైర్లల్లో నీరు నిలిచిపోతున్న కారణంగా.. మొక్కలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా వర్షాలు పడితే మళ్లీ విత్తనాలు వేసుకోవాల్సి వస్తుందని అన్నదాతలు వాపోతున్నాయి.

కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో పత్తి, మొక్కజొన్న, పెసర పైర్లు సాగు చేశారు. నందిగామ, చందర్లపాడు, పెనుగంచిప్రోలు, వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లో పత్తి, మిర్చి సాగు వేశారు. రోజు కురుస్తున్న వానలతో పైర్లల్లో నీరు చేరడం వల్ల భూమిలో తేమశాతం ఎక్కువై మొక్కలు వేర్లు కుళ్లిపోయి ఎండిపోతాయని కలత చెందుతున్నారు. రెండు నియోజకవర్గాల్లో వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి.

ఇవీ చూడండి:

విజయవాడలో నేలకొరిగిన 100 ఏళ్ల భారీ వృక్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.