ETV Bharat / state

దుర్గగుడిలో దసరాకు 7 లక్షల లడ్డూలు తయారు!

author img

By

Published : Sep 27, 2020, 11:13 PM IST

ఈ ఏడాది దసరాకు దుర్గ గుడిలో లడ్డూ ప్రసాదం మాత్రమే భక్తులకు అందజేయనున్నారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తం 7 లక్షల లడ్డూలు తయారుచేయనున్నారు.

dusserah festival arrangement in vijayawada durga temple
దుర్గగుడిలో దసరాకు 7 లక్షల లడ్డూలు తయారు!

దసరా ఉత్సవాలకు విజయవాడ దుర్గగుడి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా అన్ని రకాల ప్రసాదాలు అందుబాటులో ఉంచట్లేదని అధికారులు తెలిపారు. అమ్మవారి లడ్డూలు మాత్రమే పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

దసరా ఉత్సవాలు మొదలైన తర్వాత 4 రోజులు.. రోజుకు 50 వేల లడ్డూల చొప్పున తయారుచేసేలా ప్రణాళిక వేశారు. మిగిలిన రోజులు మొత్తం కలిపి 5 లక్షల లడ్డూలు తయారు చేయాలని భావిస్తున్నారు. మొత్తం 7లక్షల లడ్డూలు తయారుచేయనున్నారు. కరోనా కారణంగా రోజుకు 10 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.

ఇవీ చదవండి:

బాలూ స్వరం దేవుడిచ్చిన వరం: అమితాబ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.