ETV Bharat / state

నటుడు రామ్​ ట్వీట్ చేస్తే నోటీసులు ఇస్తామనడం హాస్యాస్పదం: రామకృష్ణ

author img

By

Published : Aug 18, 2020, 8:28 PM IST

నటుడు రామ్​ ట్వీట్ చేస్తే పోలీసులు నోటీసులు ఇస్తామనటం హాస్యాస్పదంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహించారు. పోలీసులంటే అధికార పార్టీ నాయకులకు లెక్కలేదన్నారు.

cpi ramakrishna speaks about police notice to hero ram
నటుడు రామ్​ ట్విట్టర్ పోస్టు పెడితే నోటీసులు ఇవ్వటం హాస్యాస్పదం: రామకృష్ణ

సినీ నటుడు రామ్ ట్వీట్ పెడితే ఆయనకు నోటీసులు ఇస్తామని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేయడం విన్నాను కానీ... ఇప్పుడు న్యాయమూర్తుల ఫోన్ లు కూడా ట్యాప్ చేయడం చూస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ఇంతకన్నా దారుణం మరొకటి లేదని... విజయవాడలో వైకాపా నాయకుడు పట్టపగలు కిరోసిన్ పోసి హత్యాయత్నం చేస్తే పోలీసులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. పోలీసులంటే అధికార పార్టీ నాయకులకు లెక్కేలేదని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై డీజీపీ సమాధానం చెప్పాలన్నారు.

ఇదీ చదవండి:

మాజీ ప్రియుడ్ని చంపి... తాజా ప్రియుడితో వెళ్లిపోయింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.