ETV Bharat / state

ప్రజలు ఆదరిస్తున్నా జగన్ కనికరించట్లేదు: ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 10:52 PM IST

MLA Anna Rambabu unhappy with YCP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. నాయకులు ఒక్కొకరిగా పార్టీని వీడి తమ అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా సరైన గుర్తింపు ఉండట్లేదని ఆవేదవ వ్యక్త పరుస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అసంతృప్తిని బయటపెట్టారు. ప్రజలు ఆదరిస్తున్నా సీఎం కనికరించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

class_war_in_ysrcp
class_war_in_ysrcp

Class war in YSRCP: వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జ్​ల మార్పు, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుడంతో అధికార పార్టీలో వర్గ విభేదాలు బయట పడుతున్నాయి. దీంతో ఆ పార్టీలో రోజు రోజుకు ముసలం ముదురుతోంది. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాజీనామాతో మొదలైన ఈ అసంతృప్తి రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటోంది. అదే సమయంలో సీఎం జగన్ నియోజక వర్గ ఇన్​ఛార్జ్​లను మార్చడం కూడా ఆ పార్టీ నేతల్లో నిప్పు రాజేసింది. ఈ నిప్పు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం.

సమన్వయకర్తల నియామకంతో వైఎస్సార్సీపీలో రగడ - రోజురోజుకీ ముదురుతున్న వర్గపోరు

MLA Parthasarathy Comments: తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అసంతృప్తిని బయటపెట్టారు. కృష్ణా జిల్లా కంకిపాడులో వైసీపీ నిర్వహించిన సామాజిక సాధికార సభ వేదికగా విభేదాలు బయటపడ్డాయి. సీఎం జగన్ తనను అవమానించారని ఎమ్మెల్యే పార్ధసారధి అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో అన్ని కులాలు తనని ఆదరించినా సీఎం జగన్ గుర్తించకపోవటం దురదృష్టకరం అంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజలే తనని కాపాడుతారంటూ స్పష్టం చేశారు. పార్థసారథి వ్యాఖ్యల అనంతరం వెంటనే మంత్రి జోగి రమేష్ వేదిక నుంచి వెళ్లిపోయారు. నేతలు ఆపుతున్నా ఆగకుండా మంత్రి జోగి రమేష్ వెళ్లిపోయారు. ఇలా ఒక్కరిగా పార్టీ అధిష్టానంపై తమ అసంతృప్తిని బయటపెడుతుండటం పార్టీ పెద్దలను కలవర పెడుతోంది.

ప్రజలు ఆదరిస్తున్నా జగన్ కనికరించట్లేదు: ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు

Class War in YSRCP ఏలూరు వైఎస్సార్​సీపీలో వర్గపోరు.. ఎంపీ అనుచరులను అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు!

MLA Anna Rambabu Unhappy With YCP: ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్టు ఇవ్వరని గ్రహించిన ఆయన చాకచక్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన ఈ సందర్బంలో చేసిన వ్యాఖ్యలు అధికాకార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తనను ఓ సామాజిక వర్గం వేదింపులకు గురి చేస్తుందని తన ఆవేదనను వెళ్లగక్కారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఓటమికి నడుం బిగిస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే టికెట్ సీఎం సామాజిక వర్గం వారికే ఇస్తారా లేక అన్నా రాంబాబుని బుజ్జగిస్తారా అనేది నియోజకవర్గం వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Class war in YSRCP హిందూపురం వైఎస్సార్సీపీలో వర్గపోరు తారాస్థాయికి .. పోలీస్​స్టేషన్ వేదికగా పంచాయితీ

YCP MLC to Janasena: విశాఖ జిల్లా వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ జనసేనలో చేరారు. వంశీకృష్ణకు కండువా కప్పి పవన్ కల్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ యాదవ్​తో పాటుగా ఆయన అనుచరులు సైతం జనసేనలో చేరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.