ETV Bharat / state

మచిలీపట్నంలో వైకాపా ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు.. తోపులాట..

author img

By

Published : Sep 25, 2021, 1:54 PM IST

Updated : Sep 25, 2021, 3:06 PM IST

ysrcp rally at machilipatnam
మచిలీపట్నంలో వైకాపా ర్యాలీ

13:51 September 25

తోపులాటలో కిందపడబోయిన ఉప్పాల హారిక

మచిలీపట్నంలో వైకాపా ర్యాలీ

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన వైకాపా ర్యాలీలో గందరగోళం నెలకొంది. జడ్పీటీసీ ఛైర్​ పర్సన్​గా ప్రమాణస్వీకారానికి ఉప్పాల హారిక.. గుడ్లవల్లేరు మండలం కొండాలమ్మ గుడి నుంచి మచిలీపట్నం జడ్పీటీసీ కార్యాలయానికి భారీ ర్యాలీతో వచ్చారు. జడ్పీ కార్యాలయం గేటు లోనికి రావడానికి వైకాపా కార్యకర్తలు యత్నించారు. పోలీసులు కేవలం ఎన్నికైన సభ్యులను మాత్రమే లోనికి అనుమతించారు. కార్యాలయం గేటు వద్ద కార్యకర్తలను నిలువరించటంతో తోపులాట చోటు చేసుకుంది.  ఈ తోపులాటలో ఉప్పాల హారిక కిందపడబోయారు. ఒక్కసారిగా లోపలికి వచ్చిన కార్యకర్తలు, నిలువరించే క్రమంలో పోలీసులు కిందపడిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 

LIVE UPDATES: జడ్పీ ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

Last Updated : Sep 25, 2021, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.