ETV Bharat / state

సంక్రాంతి సంబరాల్లో సందడి చేసిన హాస్యనటుడు అలీ

author img

By

Published : Jan 11, 2021, 3:14 AM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ప్రముఖ సినీ హాస్యనటుడు అలీ పాల్గొన్నారు. 'జూదం వద్దు-సాంప్రదాయ క్రీడలు ముద్దు' అనే నినాదంతో జరిగిన ఆటల పోటీలను తిలకించారు. యువతతో కలిసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు.

ine comedian Ali at avanigadda
సంక్రాంతి సంబరాల్లో సందడి చేసిన హాస్యనటుడు అలీ

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం అవనిగడ్డ డిగ్రీ కాలేజీ మైదానంలో సంక్రాంతి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా "జూదం వద్దు-సాంప్రదాయ క్రీడలు ముద్దు" అనే నినాదంతో అవనిగడ్డ సబ్ డివిజన్ పొలీస్ శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్‌, కబడ్డి పోటీలు నిర్వహించారు. అయితే సినిమా చిత్రీకరణలో భాగంగా అవనిగడ్డకు విచ్చేసిన ప్రముఖ సినీ హాస్యనటుడు అలీ ఈ పోటీలను తిలకించారు. యువతతో కలిసి కబడ్డీ ఆడిన ఆలీ.. క్రీడాకారులను ఉత్తేజపరిచారు. యువత ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ పోటిల్లో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు మొదటి, రెండవ నగదు బహుమతి ప్రకటించిన ఆయన... ప్రతి ఏడాది నగదు బహుమతి పంపిస్తానని తెలిపారు.

ఇదీచూడండి:

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.