ETV Bharat / state

'ఆ బిల్లులు చట్ట వ్యతిరేకం'.. గవర్నర్​కు చంద్రబాబు లేఖ

author img

By

Published : Jul 19, 2020, 9:29 AM IST

రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ చట్టం రద్దు బిల్లులపై నిర్ణయం తీసుకునే సమయంలో వాస్తవాలను పరిగణలోనికి తీసుకోవాలని కోరారు. రాజకీయ కక్షల ముసుగులోనే వైకాపా ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకువచ్చిందని విమర్శించారు.

chandra babu
chandra babu

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ చట్టం రద్దు బిల్లులు 2014 ఏపీ పునః వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్​కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలంటూ ఆరు పేజీల లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్షల ముసుగులోనే వైకాపా ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకువచ్చిందని మండిపడ్డారు. రాజధానుల వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు, శాసనసభ నిబంధనల ప్రకారం ఈ బిల్లులను చర్చించడం/ ఆమోదించడం కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

పునః వ్యవస్థీకరణ చట్టం -2014 ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నెలకొల్పాం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల ప్రకారం విజయవాడ- గుంటూరు మధ్య ప్రాంతాన్ని కొత్త రాజధాని నగరంగా ఎంపిక చేశాం. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటైన నగరంగా పకడ్బందీగా అమరావతిని డిజైన్ చేశాం. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. శాసన మండలి ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి సూచించింది. సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్నందున శాసన మండలి రెండోసారి బిల్లులను పరిగణించలేదు. ఈ బిల్లులపై నిర్ణయం తీసుకునే సందర్భంగా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన చర్యలు తీసుకోవాలి- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి

గవర్నర్​ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.