ETV Bharat / state

అన్నదాతకు అండగా కృష్టా జిల్లాలో కొవ్వొత్తుల ర్యాలీ

author img

By

Published : Dec 15, 2020, 8:56 PM IST

నూతన వ్యవసాయ చట్టాలపై దిల్లీలో పోరాడుతున్న అన్నదాతలకు సంఘీభావంగా.. కృష్టా జిల్లాలో రైతు సంఘం సభ్యులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. కేంద్రం మెుండి పట్టుదల వీడి సమస్య పరిష్కారానికి దిగి రావాలని డిమాండ్ చేసింది. రైతన్నలపై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించింది.

candle rally at krishna district
కృష్ట్రా జిల్లాలో కొవ్వొత్తుల ర్యాలీ

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో అన్నదాతలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా.. కృష్ణా జిల్లా రాఘవపురంలో రైతు సంఘం సభ్యులు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. మూడు నూతన వ్యవసాయ చట్టాలు.. అంబానీ, ఆదానీ వంటి బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం తెచ్చినవేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్షకులకు, వ్యవసాయ రంగానికి నష్టదాయకమైన కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. పంటలకు మద్దతు ధరలు కల్పించేందుకు రుణ విమోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

గత 20 రోజులుగా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా లక్షలాది మహిళలతో సహా దిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతు తెలిపారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉద్యమంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించడం, అన్నదాతలను పాకిస్థాన్ ఉగ్రవాదులంటూ ప్రచారం చేస్తూ.. చట్టాలు రద్దు చేసేది లేదంటున్న కేంద్రం తీరుపై రైతు నాయకులు మండిపడ్డారు.

ఇదీ చూడండి:

'తాడేపల్లి ప్యాలెస్​లో జగన్​ రెడ్డి ఫిడేలు వాయించుకుంటున్నారా?'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.