ETV Bharat / state

నేటి నుంచి 30వ తేదీ వరకు బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయం మూసివేత

author img

By

Published : Apr 20, 2021, 2:48 PM IST

రెండో దశ కరోనా విజృభిస్తున్న వేళ పలు చోట్ల మళ్లీ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. కొవిడ్​ తీవ్రత దృష్ట్యా నేటి నుంచి 30వ తేదీ వరకు బెజవాడ బార్‌ అసోసియేషన్‌ కార్యాలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

Bezwada Bar Association office
బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయం

బెజవాడ బార్ అసోసియేషన్​పై కరోనా ప్రభావం పడింది. కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా నేటి నుంచి 30వ తేదీ వరకు కార్యాలయం మూసివేస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డి.పి.రామకృష్ణ తెలిపారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కార్యాలయానికి ఎవరూ రావొద్దని సూచించారు.

ఇదీ చదవండి: 'విజయవాడ నగరం అభివృద్ధి పథంలో ముందుకువెళ్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.