ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Nov 25, 2022, 5:00 PM IST

ఏపీ ప్రధాన వార్తలు

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

  • 'విద్యుత్​ సబ్సిడీ తొలగించడమే కాకుండా.. రూ.12 వేలు కట్టాలనడం దారుణం'
    CHANDRABABU ON POWER CUT: అల్లూరి జిల్లా అల్లివరం గ్రామానికి విద్యుత్​ నిలిపివేతపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ తొలగించడమే కాకుండా.. రూ.12 వేలు బిల్లు కట్టాలనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎస్​.. తెలంగాణ సిట్​ నోటీసులు అందాయి: ఎంపీ రఘురామ
    MP RRR ON TS SIT NOTICES : "తెరాస ఎమ్మెల్యేలకు ఎర" కేసులో సిట్​ నోటీసులిచ్చారన్న వార్తలపై వైసీపీ ఎంపీ రఘురామ స్పందించారు. దిల్లీలోని తన నివాసంలో సిట్​ నోటీసులు అందజేశారని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మంత్రి అప్పలరాజుకు ఆదివాసీల నుంచి నిరసన సెగ.. ఎందుకంటే..!
    Minister Appalaraju: మంత్రి అప్పలరాజుకు.. ఆదివాసీల నుంచి నిరసన సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో బోయ, వాల్మీకి, నకిలీ బొంతు ఒరియాలను గిరిజన జాబితాలో చేర్చవద్దని.. ఆదివాసీలు పలాసలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అందుకు సంబంధిం జీవో 52 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం తీసుకున్న మంత్రి ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రకృతిని నాశనం చేసిన పాపం ఊరికే పోదు: సీపీఐ నేత నారాయణ
    NARAYANA VISIT RUSHIKONDA : ప్రకృతిని నాశనం చేసిన పాపం మాత్రం ఊరికే పోదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. రుషికొండను సందర్శించిన ఆయన.. ప్రభుత్వ పెద్దలు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇండియన్​ ఆటోవాలాకు ఫారిన్ అమ్మాయితో పెళ్లి.. నాలుగేళ్ల ప్రేమ కథకు శుభంకార్డ్​!
    ఓ ఇండియన్​ ఆటోడ్రైవర్​కు.. విదేశీ యువతితో ఘనంగా వివాహం జరిగింది. భారతీయ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల మధ్య దేవుడి సన్నిధిలో వారిద్దరూ ఒక్కటయ్యారు. దీంతో వారి నాలుగేళ్ల ప్రేమకు శుభంకార్డ్​ పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఒకప్పుడు తాగుబోతుల అడ్డా.. ఇప్పుడు గ్రంథాలయం.. 'ట్రీ లైబ్రరీ'తో మారిన రూపురేఖలు
    బంగాల్​లో ఓ వ్యక్తి సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. జూదం, మద్యపానాన్ని నివారించేందుకు ట్రీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం అక్కడ పుస్తక పఠనంతో పాటు ఆటపాటలను కూడా నిర్వహిస్తున్నారు. మరి ఆ ట్రీ లైబ్రరీ గురించి తెలుసుకుందామా.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆస్ట్రేలియాలో అమ్మాయిని చంపి పరార్.. నాలుగేళ్లకు దిల్లీలో అరెస్ట్
    24 ఏళ్ల ఆస్ట్రేలియా యువతి కార్డింగ్లీ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌విందర్‌ సింగ్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో కార్డింగ్లీ హత్య తర్వాత రాజ్‌విందర్‌ సింగ్‌ తన కుటుంబాన్ని ఆస్ట్రేలియాలోనే విడిచిపెట్టి భారత్‌కు పారిపోయి వచ్చాడు. ఇటీవలే ఆస్ట్రేలియా పోలీసులు అతని ఆచూకీ తెలిపిన వారికి మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జీవనకాల గరిష్ఠానికి స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్@62,294
    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 62, 294 పాయింట్లకు చేరుకుంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 18,153 వద్ద స్థిరపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తొలి వన్డే కివీస్​దే.. టీమ్​ఇండియాకు తప్పని ఓటమి
    మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'జై బాలయ్య' సాంగ్.. రామ జోగయ్య శాస్త్రి అసహనం.. అసలేమైందో
    బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా కోసం తాను రాసిన 'జై బాలయ్య' సాంగ్ విడుదలైన కాసేపటికి ఓ ట్వీట్​ చేసి అసహనం వ్యక్తం చేశారు ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి. ఏం జరిగిందంటే?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.