ETV Bharat / state

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి - ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

author img

By

Published : Jan 20, 2022, 4:43 PM IST

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఉద్యోగుల వేతనాల విషయంలో సీఎం స్వయంగా చెప్పినా.. అధికారులు వేరుగా జోవోలు ఇచ్చారని సంఘ అధ్యక్షుడు కె. సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆకాంక్షల ప్రకారం అంతా కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

ఉద్యోగుల వేతనం విషయంలో ప్రభుత్వం అంకెల గారడి చేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.సూర్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగుల వేతనం తగ్గకుండా చూడాలని సీఎం స్వయంగా చెప్పినా అధికారులు జీవోలు ఇచ్చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగులు విడివిడిగా పోరాడే కన్నా కలిసి ఒకే రకమైన కార్యాచరణ రూపొందించుకోవాలని భావిస్తున్నామన్నారు. ఇందులో భేషజాలకు తావులేదు.. అంతా పోరాడేది ఉద్యోగుల కోసమేనని స్పష్టం చేసారు. కలిసి పని చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘాన్ని కోరామని తెలిపారు. దానికి వెంకట్రామిరెడ్డి అంగీకారాన్ని తెలిపారన్నారు. ఎన్జీవోలు, రెవెన్యూ సంఘాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని పేర్కొన్నారు. రేపటిలోగా ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ఒక రూపం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

ఉద్యోగుల ఆకాంక్షల ప్రకారం అంతా కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీ జీవోలు వెనక్కు తీసుకునే వరకూ ఉద్యోగ సంఘాలు కలిసి పనిచేస్తామని అన్నారు. ముందుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒకే వేదిక ఏర్పాటుకు వచ్చాయని.. సచివాలయ ఉద్యోగుల సంఘంగా తాము కూడా ముందడుగు వేస్తామని తెలిపారు. ఇతర సంఘాల వారు కూడా సంప్రదింపులు చేస్తున్నారని అన్నారు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.