ETV Bharat / state

AP Electricity Employees Strike: 'ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మె'.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో సబ్ కమిటీ చర్చలు

author img

By

Published : Aug 9, 2023, 5:43 PM IST

Electricity_Workers_Strike_Sub-committee_Discussions
Electricity_Workers_Strike_Sub-committee_Discussions

Electricity Workers Strike : విద్యుత్ ఉద్యోగుల సమ్మె హెచ్చరికల నేపథ్యంలో.. ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం జగన్.. ఇవాళ ఉదయం మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రుల సబ్ కమిటీ ఉద్యోగుల జేఏసీతో సంప్రదింపులు ప్రారంభించింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్లే అవకాశం లేదని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.

Electricity Workers Strike : సమస్యలు పరిష్కరించకపోతే ఇవాళ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగులు స్పష్టం చేసిన దృష్ట్యా... సమ్మె నివారణపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగుల డిమాండ్లు, సమ్మె నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఇప్పటికే 12 ప్రధాన డిమాండ్స్ తో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. వీటిలోని ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల పరిష్కారంపై అధికారులతో సమగ్రంగా సీఎం చర్చించి తగిన మార్గదర్శకాలు జారీ చేశారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం 4 గంటలకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలను మరో సారి చర్చలకు పిలిచి చర్చించాలని సీఎం ఆదేశించారు. పలు డిమాండ్ల(Demands) పరిష్కారంపై చర్చించి తగిన సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Electricity_Workers_Strike_Sub-committee_Discussions

Prathidwani: డిమాండ్ల సాధనకు విద్యుత్ ఉద్యోగుల పోరుబాట

Power Minister Peddireddy సీఎం ఆదేశాలతో సాయంత్రం 4 గంటలకు విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో చర్చలు జరుపుతుందని సమావేశం అనంతరం మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. సమ్మె నోటీసు లోని పలు డిమాండ్ల పరిష్కారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదని మంత్రి చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎంతో చర్చించామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

Sub-committee deliberations.. సచివాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో సబ్ కమిటీ చర్చలు జరుపుతోంది. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, సీఎస్ జవహర్ రెడ్డి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ హాజరయ్యారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలపై సీఎంతో ఇవాళ ఉదయం చర్చించిన సబ్ కమిటీ.. వేతన సవరణ, వన్‌మ్యాన్ కమిటీ నివేదికపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో చర్చిస్తోంది.

electricity workers Demands విద్యుత్ ఉద్యోగ జేఏసీ(Electricity Employees JAC)సమ్మె పిలుపు మేరకు... విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు సమాయత్తమయ్యారు. డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపు నివ్వగా.. ఇప్పటికే 12 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసు అందజేసింది. కాగా, సీఎండీ, ఉన్నతాధికారులు.. ఉద్యోగులతో పలు దఫాలు చర్చలు జరిపినా.. పీఆర్సీ సహా ప్రధాన డిమాండ్ల పరిష్కారంపై హామీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి బుధవారం రాత్రి వరకు సమయమిచ్చిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు.. సమస్యలు పరిష్కరించకపోతే అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామన్న స్పష్టం చేశారు.

Power employees protest : ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె.. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగుల అల్టిమేటం

TDP leader Kala Venkatarao విద్యుత్ ప్రాజెక్టులు అస్మదీయులకు కట్టబెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత కళా వెంకట్రావు ఆరోపించారు. అంచనాలు పెంచి వినియోగదారులపై భారం మోపుతున్నారని, విద్యుత్‌శాఖను జగన్ తన కమీషన్ల అడ్డాగా మార్చుకున్నారని విమర్శించారు. విద్యుత్ రంగ నిధులను జగన్ బినామీలకు దోచిపెడుతున్నారన్న కళా వెంకట్రావు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ శాఖలో అవినీతిపై కమిటీ వేస్తామని తెలిపారు.

BJP state president Purandeshwari విద్యుత్‌ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మెుండిగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. విద్యుత్‌ ఉద్యోగులు సమ్మె(Strike) చేస్తే సమస్యలు వస్తాయని, ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఒప్పంద కార్మికుల జీతభత్యాలు ప్రభుత్వం నేరుగా చెల్లించాలని, భేషజాలకు పోకుండా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని పేర్కొన్నారు.

APCC Media Chairman Tulsi Reddy విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా ఉంటుందని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లి లో తులసి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు సమ్మె నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. SC, ST, మైనారిటీ చెల్లెమ్మలకు ఇచ్చినట్లే బీసీలకు, అగ్రవర్ణాల లోని పేదలకు లక్ష రూపాయలు ఇవ్వాలని తులసి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 1,78,899 ఇళ్లు పీఎంఏవై (PMAY) గ్రామీణ పథకం కింద మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో కేవలం 2172 ఇళ్లు మాత్రమే పూర్తి చేయడం శోచనీయం అని విమర్శించారు. ఆత్మహత్యల్లో జాతీయ సగటు లక్ష మందికి 10.40 కాగా ఆంధ్రప్రదేశ్ లో 12.40 కావడం శోచనీయం అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద మృతుల్లో లక్ష మందికి జాతీయ సగటు 11.56 కాగా ఆంధ్ర ప్రదేశ్ లో 15.47 ఉందని వెల్లడించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వస్తే పోలవరం పూర్తవుతుంది తులసి రెడ్డి చెప్పారు.

Power Employees Protest: ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె.. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగుల అల్టిమేటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.