ETV Bharat / state

ఆంధ్ర లయోలా కళాశాలలో చల్లదనాన్ని పంచుతున్న పచ్చదనం

author img

By

Published : Apr 19, 2021, 7:33 AM IST

వేసవి తాపానికి చల్లదనాన్ని కోరుకుంటాం. బయటకి వెళ్లినప్పుడు చెట్టు నీడని వెతుక్కుంటాం. వాటి నీడలో వచ్చే చల్లని గాలి ఎంతో ఉపశమనం అనిపిస్తుంది. అలాంటిది నగరంలోని ఓ ప్రాంతంలో అరణ్యంలా వందలాది చెట్లు ఉన్నాయి. అక్కడ కాస్త తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.

andhra layola collage
ఆంధ్ర లయోలా కళాశాల

బెజవాడలో ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్లినప్పుడు చెట్టు నీడ కనిపిస్తే ప్రాణానికి ఎంతో హాయిగా అనిపిస్తోంది. అలాంటిది వందల చెట్లు ఒకే ప్రదేశంలో ఉంటే ఎంత చల్లగా ఉంటుందో కదా..?

విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల ప్రాంగణంలో ఉన్న పచ్చదనం అలాంటి అనుభూతినే కలిగిస్తోంది. 1953లో ఈ కళాశాల నిర్మాణం జరిగినప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలై పచ్చదనాన్ని పంచుతున్నాయి. నగరంలో నమోదైన ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇక్కడ 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది.

ఇదీ చదవండి:

డెయిరీ ఆలస్యం: మహిళలు, చిన్నారులకు అందని పోషకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.