ETV Bharat / state

NTR fan Death mystery: శ్యామ్​ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు: కుటుంబ సభ్యులు

author img

By

Published : Jun 28, 2023, 10:17 PM IST

NTR fan Death mystery: డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాని అనుమానాస్పద మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. అతని సెల్ఫీ వీడియో విడుదల చేసి, ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా.. శరీరం, ముక్కుపై గాయాలు ఎందుకు ఉన్నాయని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుదవారం శ్యామ్‌ తల్లిదండ్రులు, సోదరి మీడియా సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించారు.

NTR fan Death mystery
ఎన్టీఆర్​ అభిమాని మృతిపై అనుమానాలు.. 2 లక్షలు సాయం ప్రకటించిన చంద్రబాబు

NTR fan Death mystery: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బోడేకుర్రులో అనుమానాస్పదరీతిలో చనిపోయిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మేడిశెట్టి శ్యామ్ సాయి మణికంఠ మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాట్రేనికోన మండలం కొప్పిగుంటలో సాయి మణికంఠ తల్లిదండ్రులు సీత, శ్రీనివాసరావు, చెల్లి బేబీ పద్మిని మీడియాతో మాట్లాడారు. తమ కుమారుడు చనిపోయిన తీరుపై పలు అనుమానాలు ఉన్నాయని ఆత్మహత్య చేసుకున్నాడంటే.. నమ్మశక్యంగా లేదని తల్లిదండ్రులు అంటున్నారు.

మృతదేహం చూసిన వారు కూడా మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారని తెలిపారు. తమ అన్న మృతిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెల్లి బేబీ పద్మిని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యుల్ని అమలాపురం తెలుగుదేశం పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జ్ గంటి హరీష్ మాధుర్ పరామర్శించారు. సాయి మృతిపై పూర్తిగా దర్యాప్తు చేయాలని హరీష్ కోరారు. ఎన్టీఆర్ అభిమానులు వీరి కుటుంబానికి అండగా నిలిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రాయుడు బాబ్జి సాయి బాధిత కుటుంబానికి 50 వేల రూపాయలు సాయం అందించారు.

శ్యామ్​ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు

మా అన్నయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అంతా అతనికి అండగా ఉన్నారు. ఇష్టపడే హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివాడు.. ఇప్పుడు ఇలా జరగడం మేము నమ్మలేకుండా ఉన్నాం- శ్యామ్‌ చెల్లి బేబి పద్మిని

తిరుపతి నుంచి కానిస్టేబుల్​ ఒకరు వచ్చారు.. అతను మా అబ్బాయి స్నేహితుడే.. ఆయన వచ్చి అన్నీ చూసి రాసుకున్నాడు.. నీ కొడుకుది హత్యే నువ్వు ఎవరు ఏం చెప్పినా వినకు అని నాతో చెప్పారు.. అలా అని అందరూ అంటున్నారు.- శ్రీనివాసరావు, శ్యామ్‌ తండ్రి

మీరు సూసైడ్​ వీడియోలో చూశారు.. ఎవరో వెనుకాల ఒక వ్యక్తి మాట్లాడటం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలానే తాను ఇక్కడకు వచ్చి రాత్రికి రాత్రే సూసైడ్​ చేసుకునేంత అవసరం ఎందుకు వచ్చిందని అనుమానంగా ఉంది.-గంటి హరీష్ మాధుర్, టీడీపీ నాయకుడు

చంద్రబాబు 2 లక్షల సాయం.. మృతి చెందిన శ్యామ్‌ మణికంఠ తల్లిదండ్రులతో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడి ధైర్యం చెప్పారు. అదే విధంగా శ్యామ్‌ మృతిపై వివరాలు అడిగి తెలుసుకుని.. శ్యామ్‌ కుటుంబానికి రూ 2 లక్షల సాయం ప్రకటించారు.

  • తూర్పుగోదావరి జిల్లా, కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అది ఆత్మహత్య కాదు హత్య అని, దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని స్థానికులు అంటున్నారు. తమకు కూడా అనుమానం ఉందని ఇప్పుడు శ్యామ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు… pic.twitter.com/vadaGVDa7u

    — Telugu Desam Party (@JaiTDP) June 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాధితులకు న్యాయం చేయాలని టీడీపీ డిమాండ్.. తూర్పుగోదావరి జిల్లా, కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్​ది హత్యేనని తల్లిదండ్రులు చెప్తున్నా ఆ దిశగా పోలీసులు విచారణ చేయకపోవటంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. అది హత్యేనంటూ.. దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని స్థానికులు చెప్తున్న తీరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది. తమకు కూడా అనుమానం ఉందని తాజాగా శ్యామ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ.. ఆ లేఖను జత చేసింది. పోలీసులు ఇప్పటికైనా నిజాలు రాబట్టి బాధితులకు న్యాయం చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.