ETV Bharat / state

All Party Meeting on Attacks on Dalits ఎమ్మెల్సీ అనంతబాబుపై దళితాగ్రహం! జగన్ హయాంలో ఎస్సీలపై దాడులను ఎండగట్టిన అఖిలపక్షం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 4:43 PM IST

All Party Meeting on Attacks on Dalits: వేసీపీ ప్రభుత్వంలో దళితులపై జరిగుతున్న దాడులపై కాకినాడలో తెలుదుదేశం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్విహించారు. ఈ సందర్భంగా దళిత వ్యక్తిని హత్య చేసిన అనంతబాబుపై టీడీపీ నాయకులు విరుచుకుపడ్డారు.

_attacks_on_dalits
_attacks_on_dalits

All Party Meeting on Attacks on Dalits: హంతకుడు అనంతబాబుపై కాకినాడలో దళితాగ్రహ భేరి పేరిట సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ రాజకీయ పక్షాలు, దళిత నేతలు పాల్గొన్నారు. దళిత డ్రైవర్‌ను చంపేసి డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబుపై చర్యలు లేవని మాజీమంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. తొలుత జగన్‌ డైరెక్షన్‌లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారని.. తెలుగుదేశం ఆందోళన చేయడం మొదలుపెట్టాక అనంతబాబును విచారణ చేశారని గుర్తుచేశారు. డ్రైవర్‌ హత్య కేసులో అనంతబాబు ఒక్కరే కాదని.. ఇంకా ఎంతమంది ఉన్నారో వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Anarchies on Dalits: అధికార వైఎస్సార్​సీపీ పాలనలో.. దళిత, గిరిజనులపై అరాచకాలు.. నెలకు ముగ్గురి హత్య

Nakka Anand Babu Allegations on Anantha Babu: దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు(MLC Anantha Babu) దారుణంగా చంపి సాక్షాధారాలు లేకుండా చేశారని టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వం బెయిల్​పై అభ్యంతరాలు చెప్పకుండా ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతబాబు అకృత్యాలు రంపచోడవరం నియోజకవర్గంలో నేను స్వయంగా చూశానని అన్నారు. మన్యంలో గంజాయి సరఫరాకు ప్రధాన సూత్రధారి అని దుయ్యబట్టారు. దళితుడ్ని హత్య చేసిన వ్యక్తికి రెడ్ కార్పెట్ ఎవరైనా వేస్తారా అని ప్రశ్నించారు. అంతే కాకుండా సీఎం నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి అనంతబాబు హాజరయ్యారంటే ఈ ప్రభుత్వం హంతకుల పట్ల ఎలా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మాట్లాడితే దళితుల మేనమామ అని చెప్పుకునే జగన్.. అదే దళితుడిని చంపిన హంతకుడు అనంతబాబుతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు.

Manda Krishna Madiga Comments: సీఎం సొంత నియోజకవర్గంలో దళితులపై దాడులు.. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి

Jawahar Allegations on Anantha Babu: హంతకుడు సభ నిర్వహించడం దేశ చరిత్రలో రంపచోడవరంలోనే జరిగిందని టీడీపీ మాజీ మంత్రి జవహర్ అన్నారు. అనంతబాబు దళిత సమాజానికి సవాల్ విసిరారని ఆగ్రహించారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులను(Attacks on Dalits in YSP Govt) అన్ని పక్షాలు కలిసి ఎదుర్కొందాం అని అన్నారు. జగన్ తల్లి బైబిల్ పట్టుకొంటే వీరు నిజంగానే క్రైస్తవులు అని నమ్మాం కాని వీరు క్రైస్తవులు కారు.. అలాగని హిందువూ కాదని అన్నారు. వెంకటేశ్వర స్వామికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సీఎం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించలేదని అన్నారు. వైసీపీ పాలనలో దళితులకు జరిన అన్యాయంపై తీవ్రంగా పోరాడాల్సి ఉందని పిలుపునిచ్చారు. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా మారింది తెలుగుదేశం వారికి వారికి అండగా ఉంటుందని అన్నారు.

YCP Neglecting SC ST BC Communities: నా ఎస్సీ, ఎస్టీలు.. నా బీసీలంటూ గొప్పలు.. చేతల్లో మొండిచేయి

Kondru Murali Allegations on Anantha Babu: వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 1600 మంది ఎస్సీలపై కేసులు పెట్టారు.. అట్రాసిటీ కేసులు కూడా ఎస్సీలపైనే పెట్టిన వ్యక్తి జగన్ అని మాజీ మాంత్రి కోండ్రు మురళి ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలా అన్యాయం జరిగిందో ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. 107 జీవోతో ఎస్సీ పిల్లలు చదువుకునే అవకాశం కోల్లోయారు అంతే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యమైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే మనకు మనుగడ అని అన్నారు.

Mahasena Rajesh Allegations on Anantha Babu: జగన్ కంటే మనమే గొప్ప నియాజయతీగా బతుకుతున్నామని మహాసేన రాజేశ్ అన్నారు. కాకినాడ, సామర్లకోట, రౌతులపూడి.. ఇలా హత్యలకు గురైన దళితుల్ని చంపింది వైసీపీ నాయకులేనని ఆరోపించారు. అంతే కాకుండా కిరాతకంగా హత్య చేసిన అనంతబాబుని తప్పించింది వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడే నని అన్నారు. అనంతబాబుని సీఎం, పోలీసులు అండ లేకుండా రోడ్డుపై తిరగమనండి చూద్దామని సవాల్ విసిరారు. సామర్లకోటలో సభ పెట్టించాలని లోకేశ్​ను కోరతాం ఆ సభలో మా సత్తా చాటుతామని రాజేశ్​ అన్నారు.

All Party Meeting on Attacks on Dalits ఎమ్మెల్సీ అనంతబాబుపై దళితాగ్రహం!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.