ETV Bharat / state

PRAJA SANKALPA YATRA: ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు.. వైకాపా శ్రేణుల సంబురాలు

author img

By

Published : Nov 6, 2021, 2:58 PM IST

ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో పార్టీశ్రేణులు వేడుకలు నిర్వహించాయి. కేక్​ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు.

YCP LEADERS CELEBRATING FOUR YEARS OF PRAJASANKALPA YATRA AT PARTY OFFICE
కేంద్ర కార్యాలయంలో వైకాపా సంబురాలు.. కేక్ కటింగ్..

ముఖ్యమంత్రి జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి నాలుగేళ్లు పూర్తికావటంతో.. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్​ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం.. సీఎం జగన్​తోపాటు పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తల్ని సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ప్రజల ఇబ్బందులు తెలుసుకుని.. వాటినే వైకాపా మానిఫెస్టోగా మార్చి, అధికారంలోకి వచ్చాక వాటినే సీఎం జగన్ అమలు చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. పరిపాలనా ఫలాలు క్షేత్రస్థాయిలో అందాలన్న లక్ష్యంతోనే.. గ్రామవార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు.

ఇదీ చూడండి: PAYYAVULA: ఆంధ్రప్రదేశ్​ను అదానీప్రదేశ్‌గా మార్చొద్దు: పయ్యావుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.