ETV Bharat / state

ప్రాజెక్టులు, కాంట్రాక్టులే కాదు విద్యుత్‌ కూడా జగన్ అస్మదీయులకే!- ఏకంగా 47వేల కోట్ల దోపిడీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 8:06 AM IST

Updated : Dec 11, 2023, 9:43 AM IST

YCP Govt Orders to Give Huge Benefit to Indosol Company: ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడికి చెందిన ఇండోసోల్‌ సంస్థకు భారీ మొత్తంలో లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాయితీల రూపేణా సుమారు 47 వేల 809 కోట్లు దోచిపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. సీఎం అధ్యక్షతన ఎస్​ఐపీబీ (SIPB)లో ఆమోదం దక్కగానే ఉత్తర్వులు జారీఅయ్యాయి.

ycp_scam
ycp_scam
ప్రాజెక్టులు, కాంట్రాక్టులే కాదు విద్యుత్‌ కూడా జగన్ అస్మదీయులకే!- ఏకంగా 47వేల కోట్ల దోపిడీ

YCP Govt Orders to Give Huge Benefit to Indosol Company: విద్యుత్ ప్రాజెక్టులు, కాంట్రాక్టులను ఇప్పటిదాకా అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టిన జగన్‌ సర్కారు ఏకంగా విద్యుత్‌నే దోచిపెట్టడానికి సిద్ధమైంది. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ కార్పొరేషన్‌కు రానున్న 15 ఏళ్లలో 47 వేల 809 కోట్ల 94 లక్షల మొత్తాన్ని రాయితీల రూపేణా లబ్ధి చేకూర్చడానికి ఉత్తర్వులిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌-పీఎల్​ఐ పథకం కింద ఇండోసోల్‌ సంస్థ వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్‌ పీవీ సోలార్ మాడ్యూల్స్‌ తయారీ ప్రాజెక్టును దక్కించుకుంది. వెనువెంటనే ఆ సంస్థకు విద్యుత్‌ రాయితీ వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ఇందుకోసం విద్యుత్‌ టారిఫ్‌లోనే కొత్తగా కేటగిరీని సృష్టించింది. ఆ కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డి సీఎం జగన్‌కు సన్నిహితుడు కావడమే ఇందుకు కారణం. హెచ్‌టీ-3 (సి)(బి) కేటగిరీ ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి-ఏపీఈఆర్​సీ(APERC)కి డిస్కంలు ఇటీవల సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో ప్రతిపాదించాయి. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత దీనిపై ఏపీఈఆర్‌సీ నిర్ణయం తీసుకోనుంది. ఈ ఉత్తర్వులన్నీ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.

ఉత్పత్తి ప్రారంభించకుండానే ఇండోసోల్ కంపెనీకి 8వేల ఎకరాలు కట్టబెట్టారు: నాదెండ్ల మనోహర్

ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇండోసోల్‌ ఎప్పుడు ప్రారంభిస్తుందన్న సమాచారమే లేదు. ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి విద్యుత్‌ రాయితీలు వర్తిస్తాయని తొలుత పేర్కొనగా తాజా ఉత్తర్వుల్లో నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచే రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. పారిశ్రామిక విధానంలోనూ ఈ వెసులుబాటు లేదు. ఉత్పత్తిలోకి వచ్చిన 6 నెలల తర్వాతే ప్రభుత్వ ప్రోత్సాహక రాయితీలు వర్తింపజేయాలన్నది పారిశ్రామిక విధానం. ఇండోసోల్‌ కంపెనీ అడిగిందే తడవుగా ఫైల్‌ పరుగులు పెట్టింది. అదనంగా భూముల సేకరణ, విద్యుత్‌, గనులు, ప్రాజెక్టు గ్రౌండింగ్‌ సపోర్టు, ఫిజికల్‌ ఇన్సెంటివ్‌లు కావాలని కోరుతూ అక్టోబరు 17న సంస్థ డైరెక్టర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు.

అదే నెల 20న స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశమైంది. 30న సీఎం అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు భేటీ అయి సంస్థ కోరినట్లుగా అనుమతులు ఇచ్చేసింది. గత ఉత్తర్వుల ప్రకారం పరిశ్రమ ఏర్పాటుకు 5 వేల 148 ఎకరాల భూమి సేకరించడానికి అనుమతించింది. దీనికి అదనంగా 3 వేల 200 ఎకరాలను సేకరించడానికి వీలు కల్పిస్తూ సవరణ ఉత్తర్వులిచ్చింది. అంటే 8 వేల 348 ఎకరాలు సేకరించబోతోందన్నమాట!

సొంత జాగీరులా అస్మదీయ కంపెనీలకు ట్రాన్స్‌కో నిధులు దోచిపెడుతున్నారు: లంకా దినకర్​

ఎల్‌టీ కేటగిరీలో ఎనర్జీ ఇంటెన్సివ్‌ ఇండస్ట్రీస్‌కు ఇప్పటికే డిస్కంలు నిర్దేశించిన టారిఫ్‌ ఉంది. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ఆ టారిఫ్‌ ప్రకారమే డిస్కంలు బిల్లులు అందిస్తాయి. ఈ ప్రకారం ఇండస్ట్రియల్‌ టారిఫ్‌లో ఎల్‌టీ కేటగిరీ-3 కింద యూనిట్‌కు 5 రూపాయల 80 పైసల వంతున గరిష్ఠ డిమాండ్‌ ఛార్జీలు కలిపి యూనిట్‌కు సగటున 12 రూపాయల చొప్పున పారిశ్రామికవేత్తలు చెల్లిస్తున్నారు. వాటికి పారిశ్రామిక విధానం ప్రకారం వాడిన విద్యుత్‌లో యూనిట్‌కు రూపాయిన్నర వంతున రాయితీ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇండోసోల్‌కు మాత్రం భారీ లబ్ధి చేకూర్చేలా ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు.

వచ్చే ఐదేళ్లలో విద్యుత్‌ వినియోగం ఎంత పెరగబోతోంది, రాష్ట్ర అవసరాలేంటి అన్న అంచనాలతో విద్యుత్‌ సంస్థలు ఏటా ఏపీఈఆర్‌సీకి నివేదిక దాఖలు చేస్తాయి. అందులో ప్రస్తావించిన ప్రకారం.. ఐదో కంట్రోల్‌ పీరియడ్‌ అనగా 2024-25 నుంచి 2028-29 వరకు అవసరమైన విద్యుత్‌ అంచనాలను పేర్కొన్నాయి. భవిష్యత్తులో పెరిగే వినియోగం, దాన్ని భర్తీ చేయడానికి అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకోడానికి డిస్కంల ప్రణాళికలను ప్రస్తావించాయి. ఈ ప్రకారం ఇండోసోల్‌ కంపెనీ 2024-25 నుంచి రెండేళ్ల పాటు ఏటా 768.96 ఎంయూలు వినియోగించవచ్చని అంచనా వేశాయి. అలాగే 2026-27 నుంచి ఏటా 4 వేల 656.96 ఎంయూలు వాడొచ్చని పేర్కొన్నాయి.

షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ అనుబంధ సంస్థకు 4 వేల 827 ఎకరాల భూ కేటాయింపు

పీఎల్‌ఐ పథకం కింద సోలార్‌ మాడ్యూల్స్‌ తయారుచేసే కంపెనీలు వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు 4రూపాయలుగా నిర్దేశిస్తూ ప్రభుత్వం 2022 సెప్టెంబరు 15న ఉత్తర్వులిచ్చింది. యూనిట్‌కు చెల్లించే ధరలోనే ఫిక్స్‌డ్‌ డిమాండ్‌ ఛార్జీలు, ఎనర్జీ ఛార్జీలు, టైమ్‌ ఆఫ్‌ డే ఛార్జీలు కలిసి ఉంటాయని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉంది. ప్లాంటు ఉత్పత్తిలోకి వచ్చిన మొదటి ఏడేళ్ల పాటు యూనిట్‌కు 4 రూపాయల చొప్పున, తర్వాత ఎనిమిదేళ్ల వరకు నాలుగున్నర రూపాయల వంతున ఛార్జీలు వసూలు చేసేలా కొత్తగా హెచ్‌టీ-3 (సి)(బి) కేటగిరీ చేర్చడానికి అనుమతించాలని డిస్కంలు ఏఆర్‌ఆర్‌లో ప్రతిపాదించాయి. పీఎల్‌ఐ కింద వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్‌ పీవీ సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ కర్మాగారాలు వాడే విద్యుత్‌కు ప్రత్యేకంగా హెచ్‌టీ-3(సి) కేటగిరీ టారిఫ్‌ ఏర్పాటు చేయాలని విద్యుత్‌ సంస్థలను ఆదేశిస్తూ ప్రభుత్వం 2023 నవంబరు 9న జీవో 112 జారీ చేసింది.

ఇండోసోల్‌ కంపెనీ 2024-25లో 768.96 ఎంయూల విద్యుత్‌ వినియోగిస్తే, యూనిట్‌కు 4 రూపాయల వంతున ఏడాదికి 307 కోట్ల 54 లక్షల రూపాయలు ఛార్జీల కింద చెల్లించాల్సి వస్తుంది. అదే వినియోగానికి ప్రస్తుతం పరిశ్రమల నుంచి వసూలు చేసే టారిఫ్‌ ప్రకారం యూనిట్‌ 12 రూపాయల వంతున లెక్కిస్తే 922 కోట్ల 75 లక్షల రూపాయలు చెల్లించాలి. ఈ లెక్కన ఏడాదికి 615 కోట్ల 17 లక్షల లబ్ధి చేకూర్చినట్లే. ఛార్జీలు తగ్గించడం వల్ల రెండేళ్లలో ఆ సంస్థకు చేకూరే లబ్ధి 12 వందల 30 కోట్ల 34 లక్షల రూపాయలు.

రౌడీల్ని అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారం - విశాఖలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత

2026-27 నుంచి ఏటా ఆ కంపెనీ వినియోగించే విద్యుత్‌ 4 వేల 656.96 ఎంయూలుగా డిస్కంలు అంచనా వేశాయి. ఈ విద్యుత్‌కు యూనిట్‌కు 4 రూపాయల వంతున ఐదేళ్లలో 9 వేల 313 కోట్ల 92 లక్షల రూపాయులు బిల్లుల రూపేణా చెల్లించాల్సి ఉంది. అదే విద్యుత్‌కు 12 రూపాయల వంతున లెక్కిస్తే 27 వేల 941 కోట్ల 76 లక్షలు అవుతుంది. ఐదేళ్లలో బిల్లుల రూపేణా 18 వేల 627 కోట్ల 84 లక్షలు సంస్థకు లబ్ధి చేకూరినట్లే. 2032-33 నుంచి ఏటా 4 వేల 656.96 ఎంయూల విద్యుత్‌ వాడుకుంటే యూనిట్‌కు నాలుగున్నర రూపాయల వంతున 2 వేల 95 కోట్ల 63 లక్షలు బిల్లు చెల్లించాలి.

ఎనిమిదేళ్లలో ఆ మొత్తం 16 వేల 765 కోట్ల 5 లక్షలు. అదే విద్యుత్‌కు యూనిట్‌కు 12 రూపాయల వంతున 8 ఏళ్లకు 44 వేల 706 కోట్ల 81 లక్షలు బిల్లుల కింద వసూలు కావాలి. ఈ లెక్కన 8 ఏళ్లలో 27 వేల 941 కోట్ల 76 లక్షల రూపాయల లబ్ధి చేకూరనుంది. ప్రాజెక్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రస్తుతం పరిశ్రమలకు అమలు చేసే టారిఫ్‌తో పోలిస్తే 47 వేల 809 కోట్ల 94 లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఇండోసోల్‌ సంస్థకు దోచిపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

Last Updated : Dec 11, 2023, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.