ETV Bharat / state

స్మార్ట్​ మీటర్ల ఏర్పాటుతో జనం జేబుకు చిల్లు - ప్రజలపై పడనున్న 20 వేల కోట్ల భారం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 11:25 AM IST

YCP Government Scam in Setting up Smart Meters: విద్యుత్ వినియోగదారులపై మరో భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన ఛార్జీలతో ప్రజలు గగ్గోలు పెడుతుంటే.. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో మరో 20వేల కోట్లు అదనంగా బాదనున్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ ఈ పథకాన్ని పట్టించుకోపోగా.. కర్ణాటక ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంది. జగన్ సర్కార్ మాత్రం ఈ అదనపు భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమయ్యారు.

ycp_scam_in_smart_meters
ycp_scam_in_smart_meters

స్మార్ట్​ మీటర్ల ఏర్పాటుతో జనం జేబుకు చిల్లు- ప్రజలపై పడనున్న 20 వేల కోట్ల భారం

YCP Government Scam in Setting up Smart Meters: ప్రజలపై వేలకోట్ల రూపాయల భారం పడుతుందని తెలిసినా.. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్సుకత చూపుతోంది. ఇప్పటికే వేల రూపాయల విద్యుత్ బిల్లులతో ప్రజలు బెంబేలెత్తుతుంటే జగన్ సర్కార్‌ స్మార్ట్‌ భారాన్ని సైతం మోపుతోంది. లక్షకోట్లకు పైగా అప్పులతో విద్యుత్ పంపిణీ సంస్థలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోగా.. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం తీసుకునే వేల కోట్ల రూపాయల అప్పు డిస్కంలకు మరింత భారం కానుంది.

మొదటి దశలో మూడు డిస్కంల పరిధిలో 42 లక్షల మీటర్ల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 1.12 కోట్ల విద్యుత్తు కనెక్షన్లకు కూడా కలిపితే సుమారు 19 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. స్మార్ట్‌ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు 20వేల కోట్లు ఖర్చుకానుండగా.. నెలకు 216 కోట్లను అడ్వాన్స్‌డ్‌ మీటరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద గుత్తేదారు సంస్థకు చెల్లించాలి. దీన్ని వినియోగదారుల నుంచే వసూలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మీటర్ల విషయంలో సర్కారు చెబుతున్నదానికి, కేంద్రం చూపుతున్న లెక్కలకు పొంతనే లేదు.

YSRCP Government Scams: మీరా స్కీమ్​ల్లో స్కామ్​ల గురించి మాట్లాడేది.. మీ లెక్క ఓ సారి చూస్తారా..?

మొదటి దశలో ఏర్పాటు చేసే సింగిల్‌ ఫేజ్‌ స్మార్ట్‌ మీటర్‌కు జీఎస్టీతో కలిపి నెలకు 86 రూపాయలు, త్రీఫేజ్‌ మీటరుకు 176 వంతున అదానీ సంస్థకు ప్రభుత్వం చెల్లించాలి. అధికారుల లెక్క ప్రకారం మొదటి దశలో ఏర్పాటు చేసేవాటిలో త్రీఫేజ్‌ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన నెలకు 76 కోట్లను అదానీ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందం ప్రకారం 93 నెలల్లో 7 వేల 069 కోట్లు చెల్లించనున్నారు. ఒక్కో స్మార్ట్‌ మీటరుకు కేంద్రం ఇస్తున్న గ్రాంటు గరిష్ఠంగా 1350 రూపాయలు మాత్రమే. మొదటి దశలో కేంద్రం ఇస్తున్న వాటా 583కోట్లు కాగా.. మొత్తంగా మొదటి దశలో మీటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 7652 కోట్లు ఖర్చు చేస్తోంది. మిగిలిన 1.12 కోట్ల కనెక్షన్లలో 90 లక్షల గృహ విద్యుత్తు కనెక్షన్లకు సింగిల్‌ ఫేజ్‌ మీటర్లు ఏర్పాటు చేస్తే.. గుత్తేదారు సంస్థకు 93 నెలలకు 7,198 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. వీటికి కేంద్రం ఇచ్చే వాటా 1,512 కోట్లు మాత్రమే.

Skill Development Program vs Smart Meters Project: స్కిల్ డెవలప్మెంట్ దోపిడీ ఐతే.. స్మార్ట్ మీటర్లతో ప్రజాధనం దుర్వినియోగం కాదా..?

రాష్ట్రంలో 43 లక్షల స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు టెండర్ దక్కించుకున్న అదానీ సంస్థ.. మహారాష్ట్రలో 1.16 కోట్ల మీటర్ల ఏర్పాటు చేయనుంది. ఆర్‌డీఎస్‌ఎస్‌ మొదటి దశలో పనులను డిసెంబరుకు పూర్తి చేయాలి. ఇంత స్వల్ప వ్యవధిలోనే రెండు రాష్ట్రాల్లో దాదాపు 1.59 కోట్ల స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయడం సాధ్యమేనా..? లేదా అన్నది పట్టించుకోకుండానే ప్రభుత్వం పనులు అప్పగించింది. అయితే ఈ మీటర్ల ఏర్పాటు మొదట మనమే ఏర్పాటు చేస్తున్నామని.. ధరల ఖరారులో దేశానికి ఆదర్శంగా నిలవనున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ ఇప్పటికే మధ్యప్రదేశ్‌, అసోం రాష్ట్రాల్లో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మొదటి దశ కింద 7.99 కోట్ల స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతులిచ్చింది.

Electricity Reforms for Loan Incentives: అప్పుల కోసం విద్యుత్తు సంస్కరణలు.. రైతులకు సర్కార్ కరెంట్ షాక్..!

వినియోగదారుల నుంచి అంగీకార పత్రం తీసుకున్నాకే స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసేలా కర్ణాటక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలకు మినహా.. మిగిలిన వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ డిస్కంలు నిర్బంధాన్ని విధించకూడదని అక్కడి ఈఆర్‌సీ ఆదేశాలిచ్చింది. మీటర్ల ఏర్పాటు వల్ల వినియోగదారులపై అదనపు భారం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. తెలంగాణ మాత్రం అసలు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపడం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.