ETV Bharat / state

Woman Complained on SI పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ.. ఎస్సైపై ఫిర్యాదు

author img

By

Published : May 21, 2023, 5:17 PM IST

Crimes in the State: పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని.. ఓ యువతి ఎస్సైపై ఫిర్యాదు చేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. మరో ఘటనలో కృష్ణా జిల్లాలో మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మైనర్ బాలికపై.. ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలాంటి మరిన్ని వార్తలు కోసం పూర్తిగా చదవండి.

Woman Complained on SI
ఎస్‌ఐపై మహిళ ఫిర్యాదు

Woman Complained on SI: తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని గుంటూరు నగరంపాలెం ఎస్సై రవితేజపై.. షకీనా అనే యువతి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. తాడేపల్లిలో ఐద్వా కార్యకర్తలను కలిసిన యువతి.. అనంతరం వారితో కలిసి నగరంపాలెం పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఎస్సైపై.. సీఐకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎస్సై తనను మోసం చేశారని షకీనా ఆరోపించింది. యువతి ఫిర్యాదు చేయడంతో సీఐ హైమారావు కేసు నమోదు చేశారు.

మసాజ్ సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు: కృష్ణా జిల్లాలో.. మూడు మసాజ్ సెంటర్లపై పోలీసుల మెరుపు దాడిచేశారు. ఈ దాడిలో పోలీసులు అదుపులో 12 మంది యువతులను, ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగామంతా.. ఓ కానిస్టేబుల్ నివసించే ఇంటిపైన అవుతుండటంతో అతని వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మసాజ్ సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ యాప్ ద్వారా బడాబాబులకు.. అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారం!: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ముత్తంశెట్టిపాలెంలో మైన‌ర్ బాలిక‌పై కొప్పుల రాజు అనే వ్య‌క్తి అత్యాచారానికి పాల్పడ్డాడని.. బాలిక తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితుడు రాజు గతంలో కూడా ఇలాంటి ఘటనలు పాల్పడినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పాస్టర్ ముసుగులో బాలికపై అత్యాచారం చేసిన కొప్పుల రాజు అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. బాలిక దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాయ మాటలు చెప్పి చర్చిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని.. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా కొప్పుల రాజు కుటుంబ సభ్యులు చర్చిలు నిర్మించి.. పలువురి మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక మహిళలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు.

మైనర్ బాలికపై వాలంటీర్ అత్యాచారయత్నం: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం గొట్టుప్రోలు గ్రామంలో మైనర్ బాలికపై వాలంటీర్ అత్యాచారానికి యత్నించాడని.. బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు బాధితులు పిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. సునీల్ అనే వాలంటీర్.. తన కుమార్తె స్నేహితురాలైన 8వ తరగతి విద్యార్థిని వేధిస్తున్నాడని.. బాలిక తల్లి చెప్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. వెంటనే బాలిక పక్కకు తోసేసి.. తలుపు తీసుకుని వచ్చేసిందని అన్నారు. తర్వాత అనారోగ్యంతో బాలిక ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు అడగగా.. జరిగిన విషయం వివరించింది. నాలుగు రోజుల క్రితం పోలీసులకు పిర్యాదు చేస్తే రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా చేశారని అంటున్నారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని తల్లి డిమాండ్ చేస్తోంది.

Woman Complained on SI: పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ.. ఎస్సైపై ఫిర్యాదు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.