ETV Bharat / state

TDP Protest: ముస్లింలపై దాడులు జరుగుతుంటే..వారు ఏం చేస్తున్నారు: నజీర్ అహ్మద్

author img

By

Published : Dec 25, 2021, 6:47 PM IST

TDP Protest: రాష్ట్రంలో ముస్లింలపై దాడులు ఎక్కువైపోయాయని తెదేపా అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్ విమర్శించారు. నంద్యాలలోని ఓ మదర్సాపై వైకాపా నేతలు, వక్ఫ్​బోర్డు అధికారులు దాడి చేసి మూసేయటం దారుణమన్నారు.

ముస్లింలపై దాడులు జరుగుతుంటే..వారు ఏం చేస్తున్నారు
ముస్లింలపై దాడులు జరుగుతుంటే..వారు ఏం చేస్తున్నారు

TDP Protest: వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ముస్లింలపై దాడులు ఎక్కువైపోయాయని తెదేపా అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్ అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ మదర్సాపై వైకాపా నేతలు, వక్ఫ్​బోర్డు అధికారులు దాడి చేసి మూసేయటం దారుణమన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తెనాలలో మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్​తో కలిసి నిరసన వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలపై దాడులు జరుగుతుంటే..వైకాపాలో ఉన్న ముస్లిం నేతలు ఏం చేస్తున్నారని నజీర్ ప్రశ్నించారు. ఆ నాడు తెదేపా ముస్లింలకు అండగా నిలబడి.. నంద్యాలలో మదర్సాల ఏర్పాటుకు భూమిని కేటాయిస్తే.. వైకాపా ప్రభుత్వం దౌర్జన్యం చేయటం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. వైకాపా ప్రభుత్వం ముస్లింలకు ఏమీ చేయలేదని ఆక్షేపించారు. గత ప్రభుత్వం పేద ముస్లింల కోసం ప్రవేశపెట్టిన దుల్హన్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.

మదర్సాలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. దాని నిర్వాహకులు తెదేపా అభిమాని కాబట్టే దాడి చేయించారని ఆరోపించారు. కేవలం రూ.17 లక్షల బకాయిలు చెల్లించకపోతే మదర్సాపై దాడులు చేయటం సబబు కాదన్నారు.

ఇదీ చదవండి :
CJI In Christmas Celebrations: నోవాటెల్​లో క్రిస్మస్ వేడుకలు.. పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.