ETV Bharat / state

TDP Chief Chandrababu Will Go to Delhi on August 27: ఓట్ల తొలగింపు వ్యవహారం.. రంగంలోకి చంద్రబాబు.. ఈ నెల 27న దిల్లీకి పయనం

author img

By

Published : Aug 22, 2023, 1:26 PM IST

Updated : Aug 22, 2023, 4:43 PM IST

TDP Chief Chandrababu Will GO to Delhi on August 27: రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్ల తొలగింపు అడ్డుగోలుగా సాగుతున్నా.. బాధ్యులపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై టీడీపీ నేతల ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు.

TDP_Chief_Chandrababu_Will_GO_to_Delhi
TDP_Chief_Chandrababu_Will_GO_to_Delhi

TDP Chief Chandrababu Will Go to Delhi on August 27: రాష్ట్రంలో ప్రస్తుతం ఓట్ల తొలగింపు వ్యవహారం హాట్​టాపిక్​ అవుతోంది. అధికార పార్టీకి వత్తాసు పలికే వారి ఓట్లు ఉంచడం, ఓకే ఇంటి నెంబర్​తో పదుల సంఖ్యలో కొత్త ఓట్లను చేర్చడం, టీడీపీ సానుభుతిపరుల ఓట్లు తొలగించడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. వీటిపై విపక్షాలు మండిపడుతున్నా స్పందన లేదు.

Chandrababu Fires on YSRCP: ఇంటికో కర్ర పట్టుకుని.. వైసీపీ దొంగలను తరమాలి: చంద్రబాబు

TDP Supporters Votes Deletion in AP: ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్ల తొలగింపు అడ్డుగోలుగా సాగుతున్నా.. బాధ్యులపై చర్యలు మాత్రం శూన్యం. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇవి వెలుగు చూస్తున్నాయి. ఈ అక్రమాలపై ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌.. దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు పదే పదే ఫిర్యాదులు చేసి, దాదాపు సంవత్సరం పాటు పోరాడితే జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి, గతంలో జడ్పీ సీఈఓగా ఉన్న శోభా స్వరూపా రాణీపై చర్యలు తీసుకున్నారు.

Chandrababu Meeting with Intellectuals in Amalapuram: "రాష్ట్ర భవిష్యత్తు కోసం మేధావులు ఆలోచించాలి.. అభివృద్ధిలో భాగం కావాలి"

TDP Chief Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఊరు ఉరవకొండలాగానే తయారయ్యింది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో, ఏ పల్లెలో చూసినా ఓటర్ల జాబితాలో ఉరవకొండ నియోజకర్గంలో జరిగిన తరహాలో అక్రమాలు, అవకతవకలు కోకొల్లలుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. అనేక నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాలకు ఓటు అనేదే లేకుండా చేశారు. మరికొన్ని కుటుంబాల్లో ఒకరికి ఓటు ఉంచి మిగతా వారివి తీసేశారు. తాజాగా ఈ వ్యవహారంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రంగంలోకి దిగారు.

Chandrababu Criticized YCP Government: వైసీపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది: చంద్రబాబు

రాష్ట్రంలో అక్రమంగా ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఈ నెల 28న దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చంద్రబాబు(Chandrababu Delhi Tour) ఫిర్యాదు చేయనున్నారు. ఈ క్రమంలో 27వ తేదీన ఆయన దిల్లీ వెళ్లనున్నారు. 28న రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్​ చిత్రంతో రూపొందించిన ప్రత్యేక వంద రూపాయల నాణెంను రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అలాగే ఎన్టీఆర్‌తో అనుబంధం ఉన్న పలువురు నేతలకు కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం అనంతరం ఏపీలో ఓట్ల అక్రమాలపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేస్తారు. 'ఓట్ల తొలగింపులో..ఊరూరా ఉరవకొండ' లాంటి ఘటనలు ఉన్నాయని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైసీపీ సానుభూతిపరుల దొంగ ఓట్లు చేర్చడం, టీడీపీ అనుకూల ఓట్లు తొలగించడంపై ఫిర్యాదు చేయనున్నారు.

హత్యా రాజకీయాలు చేయను.. అలా చేసేవారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తా: చంద్రబాబు

Chandrababu Complaint to CEC on Votes Deletion in AP: వాలంటీర్ల ద్వారా టీడీపీ-వైసీపీ అనుకూల ఓట్ల సమాచారం సేకరించి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ సెంట్రల్, విశాఖ తదితర ఘటనల సాక్ష్యాలను సీఈసీకి అందించనున్నారు. తెలుగుదేశం నేతల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవట్లేదనే విషయాన్ని చంద్రబాబు సీఈసీకి వివరించనున్నారు.

TDP Chief Chandrababu Fire on CM Jagan: పోలవరంపై మాట తప్పిన జగన్ రెడ్డికి 'జూ' కట్టించాలి: చంద్రబాబు

ఏపీలో ఓట్ల జాబితాలో అక్రమాలపై సమాచార సేకరణకు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. వచ్చిన సమాచారాన్ని మొత్తం క్రోడీకరించి సీఈసీకి తెలుగుదేశం పార్టీ సమర్పించనుంది. అక్రమాలు నివారించటంతో పాటు బాధ్యులైన ప్రతీ అధికారిపై ఉరవకొండ తరహా చర్యలు తీసుకోవాలని సీఈసీని చంద్రబాబు కోరనున్నారు.

Chandrababu Fires on YSRCP: 'ఎన్​ఎస్​జీ లేకపోతే.. వివేకాలాగే నన్నూ చంపుతారేమో?'.. చంద్రబాబు ధ్వజం


Last Updated : Aug 22, 2023, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.