ETV Bharat / state

సైబర్​బాద్​ పోలీస్​ ఇక్కడ.. ట్రెండ్​ ఫాలో అవ్వరు.. సెట్​ చేస్తారు

author img

By

Published : Jan 7, 2023, 12:04 PM IST

Hyderabad Police New Dress Code
సైబర్​బాద్​ పోలీస్

Hyderabad Police New Dress Code: పోలీసులంటే ఎలా ఉంటారు..? ఖాకీ దుస్తులతో చూసేందుకు గంభీరంగా కనిపిస్తారు. అక్కడ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. వారిని చూస్తే పోలీసులా..? లేక ఐటీ ఉద్యోగులా..? అనే సందేహం కలుగుతుంది. ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్న హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్​ పోలీసుల తీరుపై ప్రత్యేక కథనం.

Hyderabad Police New Dress Code: పోలీసులంటే చాలు చేతిలో లాఠీ, ఖాకీ దుస్తులతో.. గంభీరమైన రూపంలో దర్శనమిస్తారు. అయితే ప్రస్తుతం నేరాల తీరు, పంథా రెండు మారాయి. ఇప్పుడు పోలీసులకు ప్రధాన సమస్యల్లా సైబర్‌ నేరాలే. అందుకే రాష్ట్రంలోని ప్రతి కమిషనరేట్, పోలీస్‌స్టేషన్లలో ప్రత్యేకంగా సైబర్‌ విభాగాలు ఏర్పాటయ్యాయి. ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టాలంటే సాంకేతికతపై పట్టు తప్పని సరి. కేసుల ఛేదనకు పోలీసులు తీవ్రంగా కృషిచేస్తుంటారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటైన సీసీఎస్ పోలీస్‌స్టేషన్ సైబర్‌ నేరాల ఛేదనలో ప్రత్యేకంగా నిలుస్తోంది.

"మా జాయింట్​ సీపీ సార్​ మాకు నచ్చిన మంచి డ్రెస్​కోడ్​తో వచ్చేందుకు మాకు పర్మిషన్​ ఇచ్చారు. ఇది మాకు చాలా సౌకర్యవంతంగా ఉంది. మేము కూడా ఒక ఐటీ సెక్టర్​లో పనిచేస్తున్నట్లు ఉంది".- రాములు సైబర్​ క్రైం కానిస్టేబుల్

హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది వస్త్రధారణ సాధారణ పోలీసులకు భిన్నంగా ఉండేలా ఉంటుంది. ఇందుకు కారణం జాయింట్‌ సీపీ గజరావ్‌ భూపాల్‌ తీసుకున్న నిర్ణయం. ఇక్కడి సిబ్బంది సివిల్‌ డ్రెస్‌లోనే విధులు నిర్వర్తించేవారు. జీన్స్‌, టీషర్ట్స్‌ వేసుకుని వచ్చేవారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వస్త్రధారణలో గజరావ్‌ భూపాల్‌ మార్పు తీసుకొచ్చారు. అందరు సిబ్బంది ఫార్మల్‌ డ్రెస్‌లోనే హుందాగా కనిపించాలని సూచించారు. షూ, ఇన్‌షర్ట్ తప్పనిసరి ఆదేశించారు. అప్పటి నుంచి సిబ్బంది అదేవిధంగా విధులకు హాజరవుతున్నారు.

"మాది సివిల్​ కోడ్​లో ఉండే డ్రెస్​ కాబట్టి మేము ఇది వరకు వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు స్టేషన్​కు వస్తేంటే చాలా బాగుంది. ఈ టై, ష్యూస్​, డ్రెస్​ కోడ్​ చాలా బాగుంది. ఒక సాఫ్ట్​వేర్​ కంపెనీలో పని చేస్తున్నట్లు ఉంది."-లక్ష్మణ్​రావు, హెడ్​కానిస్టేబుల్

ఈ వేషధారణలో విధులకు నిర్వర్తిస్తున్న కార్యాలయాన్ని చూస్తుంటే ఐటి సంస్థ మాదిరిగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సీసీఎస్​ కార్యాలయాన్ని పాత కమిషరేట్ కార్యాలయానికి మార్చారు. ఇక్కడ ఆర్ధిక నేరాల విభాగం, సైబర్ క్రైం, కోర్టు మానిటరింగ్ సెల్, స్పెషల్ టీమ్స్, జోనల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. దాదాపుగా 400 మంది వరకూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా నూతన డ్రస్ కోడ్ విధానం పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

"ఈ డ్రెస్​కోడ్​ ముఖ్య ఉద్యేశ్యం.. వారిలో ఆత్మస్థైర్యం నిండాలి.. పనిలో బాధ్యత పెరగాలి. వీళ్లు కూడా అలానే పనిచేస్తున్నారు. ఈ కొత్త డ్రెస్​కోడ్​ తీసుకొచ్చిన తరువాత అది వారిలో కనబడుతోంది. వారు మెరుగ్గా పని చేస్తారని ఆశిస్తున్నాం. కానిస్టేబుల్​ నుంచి పై స్థాయి వరకు అందరికి వారు కూర్చునే సీట్ల విషయంలో ప్రత్యేక గదులు ఉన్నాయి. కొత్త బిల్డంగ్​ చాలా బాగుంది".-గజరావ్ భూపాల్, జాయింట్ సీపీ

సైబర్​బాద్​ పోలీస్​ ఇక్కడ.. ట్రెండ్​ ఫాలో అవ్వరు.. సెట్​ చేస్తారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.